Australia Vs England : ఆసీస్ ఆ పని చేస్తే ఐసీసీ తీసుకునే చర్యలు భరించాల్సిందే.. ఇంగ్లండ్ పై కక్ష తీసుకుంటుందా..

Australia Vs England

Australia Vs England

Australia Vs England : ఇంగ్లండ్ సూపర్ 8 కు అర్హత సాధించాలన్నా.. ఆ జట్టు ఆటపైనే కాకుండా ఆసీస్ టీం పై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి మ్యాచ్ స్కాట్లండ్ తో వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు టీంలకు చెరో పాయింట్ లభించింది. ఆస్ట్రేలియా మాత్రం నమీబియా, ఒమన్,  ఇంగ్లండ్ పై గెలిచి.. సూపర్ 8 కు అర్హత సాధించింది.

ఇంగ్లండ్ ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడగా.. ఒకటి వర్షం కారణంగా రద్దయింది. మరోటి ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు నమీబియా, ఒమన్ లపై భారీ తేడా తో విజయం సాధించాలి. అదే సమయంలో స్కాట్లాండ్ ఆసీస్ పై భారీ తేడాతో ఓడిపోవాలి.దీంతో ఇంగ్లండ్  సూపర్ 8 చేరాలంటే చెమటోడ్చాల్సిందే. స్కాట్లండ్ రన్ రేట్ ఇంగ్లండ్ కంటే ఎక్కువగా ఉంది. స్కాట్లండ్ రన్ రేట్ 2.118 ఉంటే.. ఇంగ్లండ్ రన్ రేట్ -1.800 ఉంది.

కానీ ఇంగ్లండ్ సూపర్ 8 కు రాకుండా ఆపాలంటే ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఉంది. స్కాట్లండ్ పై ఓడిపోతే ఆటోమెటిక్ గా స్కాట్లండ్ సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లండ్ ఇంటి దారి పడుతుంది. కానీ ఆసీస్ కు ఓడిపోవడం అంటేనే ఇష్టముండదు. అలాంటిది క్రికెట్ లో పసికూన స్కాట్లండ్ పై ఓడిపోవడం ఊహించడానికే కష్టంగా ఉంది.

అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ ఫైన్ మాత్రం ఆసీస్ ఓడిపోవాలని అనుకోవట్లేదు. ఆసీస్ గెలవాలి. చివరి ఓవర్ లాస్ట్ బంతికి గెలవాలి. అలా అయితే స్కాట్లండ్ నెట్ రన్ రేట్ పడిపోదు. ఇంగ్లండ్ కు దెబ్బ పడుతుంది. ఒక వేళ ఇంగ్లండ్ సూపర్ 8 కు రాకుండా ఉండాలంటే ఆసీస్ ఓడిపోతే చాలు.. ఇలా కావాలని ఓడిపోతే మాత్రం ఐసీసీ క్రికెట్ రూల్స్ ప్రకారం ఆసీస్ కెప్టెన్ పై కఠిన చర్యలు తప్పవు. మరి మాజీ కెప్టెన్ మాటలు నిజం చేస్తారా.. లేక స్కాట్లండ్ పై భారీ విజయం సాధిస్తారా చూడాలి.

TAGS