MLC Kavitha : కవితకు టికెట్ ఇస్తే బెయిల్ వచ్చేదేమో.. ఆ ఎంపీ లాగా..!

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఆ పార్టీ ఇప్పటికే అనేక కష్టాల్లో ఉందంటే కవిత అరెస్ట్ వారిని మరింత కుంగదీస్తోంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఈ బెయిల్ ఉంటుంది. ఆయన తన రాజకీయ అవసరాలను దెబ్బకొట్టేందుకు ఎన్నికల్లో పోటీ, ప్రచారం చేయకుండా చేసేందుకు కేసులో ఇరికించిందని కోర్టు ముందు బలంగా వాదించారు. అదే సమయంలో సంజయ్ సింగ్ కు డబ్బు ఎలా చేరిందన్న దానిపై ఈడీ ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో సంచలనాత్మక రీతిలో బెయిల్ మంజూరు అయ్యింది.

కవితకు కూడా లోక్ సభ టికెట్ ఇచ్చి ఉంటే దాన్నే కారణంగా చూపి ఆమె కూడా బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. ఆమె సిట్టింగ్ ఎంపీ కానప్పటికీ .. బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడంలో కీలకంగా ఉంటారు. ఆమె రాజకీయ అవకాశాలను నిరూపితం కాని కేసులో..కస్టడీ కూడా పూర్తయిన తర్వాత జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు. కానీ ఈడీ బెయిల్ రాకుండా గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి సమయంలో సంజయ్ సింగ్ కు బెయిల్ లభించిన దారి.. అందరికీ ఓ అవకాశం అనుకోవచ్చు.

అయితే కవిత ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరం పాటించాలని నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న కవిత తనకు జపమాల, చదువుకోవడానికి ఆధ్యాత్మిక పుస్తకాలు, మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతి కోరారు. అలాగే చదువుకోవడానికి ఇతరత్రా పుస్తకాలు కూడా అడిగారు. అందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. కవిత అడిగిన జపమాల, మెడిటేషన్ కు అనుమతినివ్వమని, చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. బెయిల్ వచ్చినా ఆమె రాజకీయాలు చేయబోరని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. కవితపై క్యాడర్ లోనూ, సాధారణ ఓటర్లలోనూ కోపం ఉంది. లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఉందో లేదో తెలియనప్పటికీ.. ఆ చాన్స్ ఈడీకి ఎందుకిచ్చారంటూ ఆగ్రహంతో ఉన్నారు. ఒక మహిళగా ఇలాంటి పనులు చేస్తారని ఎవరూ ఊహించలేదని పలువురు అంటుండం గమనార్హం. ఆమెపై తెలంగాణ జనాల్లో ఏమాత్రం సానుభూతి లేదని, అనవసరంగా కేసీఆర్ ను, కేటీఆర్ భవిష్యత్ ను ఇరుకున పెట్టారనే అభిప్రాయం మాత్రం ఉంది. ఇదే చాలా మంది అంటున్నారు కూడా.

TAGS