Election Commission : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. విజయాన్ని ముద్దాడడానికి కూటమి, వైసీపీ, కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. జూన్ నాలుగున ఫలితాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన సిబ్బందికి ఎన్నికల కమిషన్ శిక్షణ కూడా పూర్తి చేసింది. మేము కూడా ఎమన్నా తక్కువనా అంటూ కూటమి, కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులు కూడా ఒక అడుగు ముందుకు వేశారు. లెక్కింపుకు వెళ్లే కార్యకర్తలకు పార్టీ పరంగా శిక్షణ ఇచ్చేశారు .వైసీపీ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులు ఇచ్చిన శిక్షణ మాత్రం చాల విచిత్రంగా ఉంది. ఆ శిక్షణ ఇప్పటి వరకు దేశంలో ఈ పార్టీ కూడా ఆ విదంగా ఇవ్వలేదని రాజకీయ మేధావులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వైసీపీ తన అభ్యర్థుల కోసం శిక్షణ ఏవిదంగా ఉందంటే ?. ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పక పాటించేవారు ఎవరైనా ఉంటె ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్ళకండి. లెక్కింపు భాద్యతలు చేపట్టకండి. అటువంటి వారు ఎవరైనా ఉంటె ఇప్పుడే తప్పుకోండి. జూన్ నాలుగున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. కాబట్టి ఆరోజు నిబంధనల మేరకు కేంద్రాల్లో పనిచేస్తామంటే కుదరదు. వైసీపీ పార్టీ చెప్పినట్టు లెక్కింపు కేంద్రాల్లో నడుచుకునేవారు మాత్రమే వెళ్ళాలి అంటూ వైసీపీ పార్టీ కి చెందిన ఓ పెద్ద నాయకుడు తన కార్యకర్తలకు చెప్పిన నీతి సూక్తులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మెదులుకోవాలని, నిబంధనలను ఏపార్టీ వారైన అతిక్రమిస్తే వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించిన నాయకులను చూసినం. కానీ ఈ వైసీపీ నాయకులు మాత్రం నిబంధనల మేరకు నడుచుకునేవారు లెక్కింపు కేంద్రాలకు వెళ్ళవద్దు అంటున్నారు అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన పోలింగ్ వ్యవహారాన్ని చూసిన కేంద్ర ఎన్నికల కమిషన్ తన జాగ్రత్తల్లో తానూ ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంది. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరైన తోక జాడిస్తే కత్తిరించడానికి కత్తెర కూడా సిద్ధం చేసుకొంది. లెక్కింపు రోజు
నిబంధనలు అతిక్రమిస్తే కమిషన్ తన పద్దతిని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం.