Prime Minister Modi : ప్రధాని మోదీ కుర్చీ మడత పెడితే ఆ దేశమే అతలాకుతలమే
Prime Minister Modi : ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మాట తూటాకంటే బలమైనది. మనం మాట్లాడే తీరును బట్టే మనల్ని అంచనా వేస్తుంటారు. అన్నా అంటే అన్నం తప్పదట. అరేయి అంటే తన్నులు తప్పవు. అది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. ఏది మాట్లాడినా మన నోరే. ఏంచేసినా మనతీరే. దీంతో మనం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది.
మన దేశం నుంచి అత్యధిక మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వారి ఆదాయంలో మన వారి పాత్రే అధికంగా ఉంటుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లి అక్కడ పర్యాటకాన్ని డెవలప్ చేయాలని సోషల్ మీడియాలో సూచించడంతో మాల్దీవుల మంత్రులు నోరు పారేసుకున్నారు. భారత్ లో పరిశుభ్రతకు పెద్దపీట వేయరు. అశుభ్రతలోనే జీవిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో భారతీయుల్లో ఆగ్రహం పెరిగింది.
మాల్దీవులకు ఇక మీదట వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వారు వెళ్తున్నా కొత్తగా అక్కడకు వెళ్లేందుకు ఎవరు సాహసం చేయడం లేదు. మన దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారి దురహంకారానికి తగిన శాస్తి జరిగింది. ఆ దేశ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక భారతీయులకు క్షమాపణలు చెబుతున్నా మన వారి ఆగ్రహం చల్లారడం లేదు. మనదేశంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రుల దురాగాతాన్ని అందరు ఎండగడుతున్నారు.
ఇక మీదట మాల్దీవులకు వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మోదీ కుర్చీ మడత పెడితే ఓ దేశ పరిస్థితి అతలాకుతలం అయితోందని పలువురు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు మాల్దీవుల నాయకులు వారు కూర్చున్న కొమ్మను వారే నరుక్కున్నారు. ఆ దేశానికి వచ్చే ఆదాయాన్ని చేజేతులా రాకుండా చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.