Amit Shah : ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ గెలిస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి య చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షాకు చంద్రబాబు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయహోదా ఇవ్వడంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందని అన్నారు. జగన్ అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందని అమిత్ షా పేర్కొన్నారు.