CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాల అమలులో వీరే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రతీ ఒక్కరికి చేరాలన్నదే జగన్ సిద్ధాంతం. ఇందుకోసం వలంటీర్ వ్యవస్థను బలోపేతం చేశారు. ప్రస్తుతం వారు లేనిదే ఏది నడవదని అంటున్నారు.
రాష్ట్రంలో ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే ఎలా అనే ప్రశ్న వలంటీర్లలో ఉత్పన్నమవుతోంది. టీడీపీ ప్రభుత్వం వస్తే ఒక్కో వలంటీర్ కు రూ. 10 వేల వేతనం చెల్లిస్తామని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. దీంతో టీడీపీ గెలిచినా వైసీపీ విజయం సాధించినా వలంటీర్లకు లాభమే తప్పా నష్టమేమి ఉండదు. దీంతో వారు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ప్రభుత్వ మనుగడలో కీలకంగా వ్యవహరిస్తున్న వలంటీర్ వ్యవస్థను కొనసాగించడానికే పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. జగన్ ప్రభుత్వం వస్తే వలంటీర్ల సంఖ్యను తగ్గించి వారికి ఇండ్ల సంఖ్యను పెంచుతారని అంటున్నారు. ఇదివరకు 50 ఇళ్లకు ఓ వలంటీర్ ఉంటే ఇక మీదట 70 ఇళ్లకు ఒక వలంటీర్ ను పెడతారని చెబుతున్నారు. ఇలాగైతే వలంటీర్ల సంఖ్య తగ్గే అవకాశముంటుంది.
ఎన్నికలు అయ్యే వరకు వలంటీర్లు పనిచేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో వలంటీర్లు రాజీనామా చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఉండడంతో వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికలయ్యాక వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ వస్తామని అంటున్నారు. దీంతో వలంటీర్ వ్యవస్థపై అందరికీ ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో వలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో ఒక భాగమైపోయింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నా జగన్ వలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వలంటీర్ వ్యవస్థ కోసం జగన్ పెద్ద కసరత్తు చేసినట్లు చెబుతున్నారు.