JAISW News Telugu

YS Jagan : జగన్ ఓడిపోతే రాష్ట్రం నుంచి జంప్ అవ్వడం ఖాయం!

YS Jagan

YS Jagan

YS Jagan : రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అనేక వైరుధ్యాలు, పోలికలు కనిపిస్తుంటాయి. తెలంగాణలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలను స్వేచ్చగా తిరగనీయకుండా చేశారన్న మాట వాస్తవం. తనకు ప్రమాదమనుకున్న చంద్రబాబుని, రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా చావు దెబ్బతీయడానికి కూడా ఆయన వెనకాడలేదు. అందుకు వారు ఆయనకు తగిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. కేసీఆర్‌ ఎంత నియంతృత్వ ధోరణి ప్రదర్శించినా, ప్రతిపక్షాల పట్ల చులకనగా మాట్లాడినా వారిపై రాజకీయ కక్ష సాధింపులు చేయలేదు. ఒక వేళ నిజంగానే అలాంటి వాటికి పూనుకుని ఉంటే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మరికొందరు జైల్లో ఉండేవారని కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. అప్పుడు అలాంటి చర్యలకు పాల్పడ లేదు కాబట్టే నేడు ఓడిపోయినప్పటికీ తెలంగాణలో ఉండగలుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోటీ పడగలుగుతున్నారు.

గత ఎన్నికల్లో  ఏర్పడిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఆలోచన చేయడం మొదలుపెట్టగానే.. రేవంత్‌ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని .. అందులో నాయకులను లాగేసుకునే పని చేస్తూనే ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాదని వ్యవహరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేందుకు ఇది చక్కటి ఉదాహరణ. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ‘వైసీపీ రాజకీయాలు’ చాలా భిన్నం. చంద్రబాబుతో సహా టీడీపీకి చెందిన నాయకులందరినీ జగన్‌ వేధిస్తూనే ఉన్నారు. అచ్చెన్నాయుడు మొదలు అధినేత చంద్రబాబు వరకు అందరిపై కేసులు పెట్టిస్తూనే ఉన్నారు. చివరికి చంద్రబాబుని జైల్లో కూడా పెట్టించారు. పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు సీఎం హోదాలో ఉన్న జగన్ ఆయనను ఎంతగా అవహేళన చేశారో అందరూ చూశారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ ఆఫీసులపై వైసీపీ భౌతిక దాడులు, పోసాని, వర్మ, అంబటి, రోజా, ముద్రగడ, మహాసేన రాజేష్ వంటి వారితో వారిపై హేళనగా మాట్లాడిస్తుండటం ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బ తీసేందుకు సినిమాలు తీయించడం, ఆ రెండు పార్టీలతో సంబంధాలున్నందుకు సినీ పరిశ్రమని వేధించడం ఇలా.. చాలానే చేస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేనలు కూడా వైసీపీ నేతలపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. నారా లోకేష్‌ ఎర్రడెయిరీ పట్టుకుని తిరుగుతున్నారు. కనుక ఒకవేళ ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఎవరూ రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి తలెత్తవచ్చు. ఒకవేళ టీడీపీ, జనసేన ఓడిపోతే జగన్ వాటి అంతు చూడకుండా ఈ సారి విడిచి పెట్టేలా లేరు.  కనుక టీడీపీ, జనసేన నేతలకు కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని చెప్పవచ్చు. ఎన్నికలలో ఓడిపోతే రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి ఎందుకు కలిగిందంటే, పాలకులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండకపోవడం వల్లే.

Exit mobile version