Bhatti Vikramarka : పదేళ్లు బాగా పనిచేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka
Bhatti Vikramarka : ఎమ్మెల్యే కేటీఆర్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ లేని అంశాలు మాట్లాడి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అసలు విషయాలు మాట్లాడితే బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ అంటున్నాని చెప్పారు. మాకు బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవని తెలిపారు. కేంద్రం వివక్షపై ఏం చేద్దామో చెప్పాలని సూచించారు. కేంద్రంపై ఎలా పోరాడాలో చెబితే తీర్మానం చేద్దామని తెలిపారు.
పదేళ్లు బాగా పనిచేస్తే ప్రజలు ఎందుకు ఓడంచారని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఆవు కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.