Bigg Boss Ashwini : బోర్ కొడితే పవన్ నన్ను క్యారవాన్ లోకి పిలిచేవారు.. బిగ్ బాస్ అశ్విని కామెంట్స్ వైరల్!
Bigg Boss Ashwini : బిగ్ బాస్ సీజన్ 7 అట్టహాసంగా స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఈసారి సీజన్ 7 గత సీజన్ కంటే బాగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. ఈ సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయ్యింది. అయితే మధ్యలో ఐదు వారాలు ఐదుగురు కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత మధ్యలో 5 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
వీరిలో అశ్విని కూడా ఒకరు.. ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫేమస్ అయ్యింది.. అంతకు ముందు వరకు అశ్విని శ్రీ ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా ఫేమస్ అవ్వలేదు.. మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది.. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక అక్క పాత్రలో నటించింది.
అశ్విని పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో చిన్న రోల్ చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈమె పవన్ కళ్యాణ్ తో గడిపిన క్షణాలను ఇప్పుడు గుర్తు చేసుకుంది.. పవన్ కి బోర్ కొడితే నన్ను క్యారవాన్ లోకి పిలిచి ఒక పాట పాడమ్మా అనే వారు.. ఆయన చాలా సరదాగా ఉండేవారు..
ఒకరోజు నేను కారులో ఉండిపోయాను.. 800 మందితో సాంగ్ షూటింగ్ జరుగుతుంది.. అందరు నాకోసం ఎదురు చూస్తున్నారు.. కో డైరెక్టర్ అప్పటికే నా మీద అరిచారు.. కానీ పవన్ మాత్రం నన్ను ఏమీ అనలేదు.. నువ్వు చిల్ అవ్వమ్మా అన్నారు.. అందుకే పవన్ కళ్యాణ్ ను అందరు దేవుడు అంటారు..
అప్పటి నుండి ఆయనపై మరింత రెస్పెక్ట్ పెరిగింది.. షూటింగ్ జరిగే రోజుల్లో డ్రీమ్స్ కూడా వచ్చేవి.. ఎక్కడికో వెళ్లినట్టు కలలు వచ్చేవి.. ఆయన నన్ను మర్చిపోయిన నేను ఎప్పటికి మర్చిపోను అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..