JAISW News Telugu

Jr. NTR : ఇలా చేస్తేనే ఎన్టీఆర్ కు కాలుద్ది.. ఈ సారి ఏం చేస్తాడో మరి..?

Jr. NTR

Jr. NTR

Jr. NTR : మెయిన్ స్ర్టీమ్ మీడియాపై  సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫామ్స్  పై చేయిగా నిలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని నెట్ లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదే క్రమంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రభావం మిగతా రంగాలపై ఎలా ఉన్నా, సినిమా రంగంపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానెల్స్ సినిమాలు రిలీజ్ కాకముందు విషం చిమ్ముతున్నాయని కొందరు నిర్మాతలు వాపోతున్నారు. రిలీజ్ కు ముందే ట్రైలర్లు, టీజర్లు, పాటలను బట్టి ఇదే సినిమా కథ, ఇలా ఉండబోతున్నదంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని నీరుగార్చుతున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాపై కొన్ని యూట్యూబ్ చానెళ్లు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నాయి.  విడుదలకు మరో పది రోజుల సమయం ఉంది. కానీ ఇప్పుడు రివ్యూలు చెప్పేస్తూ సినిమాపై బజ్ లేకుండా చేస్తున్నారని టీమ్ దృష్టికి వెళ్లింది. అయితే గతంలో జరిగిన సంగతిని కొందరు గుర్తు చేస్తున్నారు.

జై లవకుశ విడుదల రోజు కొన్ని వెబ్ సైట్స్, యూ ట్యూబ్ చానెళ్లు  నెగెటివ్ ప్రచారం చేశాయి. సినిమా ప్లాఫ్ అంటూ రివ్యూలు ఇవ్వడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలా రివ్యూలు, రేటింగ్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. సగటు ప్రేక్షకుడు ఏ తీర్పు ఇచ్చినా, ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా తాము స్వీకరిస్తామన్నారు. కానీ  రివ్యూలు రాసే వాళ్లు ఏ ప్రాతిపదికన సమీక్షిస్తున్నారో చెప్పాలన్నారు. కడుపులో బిడ్డ (సినిమా) బయటికి రాగానే రివ్యూలతో చంపేస్తున్నారని, ఇలా అయితే సినిమా పరిశ్రమ మనుగడ కష్టమని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దేవర సినిమాపైనా ఇలాగే ట్రోల్స్ వస్తుండడంతో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడోనని, నిర్మాతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారోననే చర్చ నడుస్తున్నది.

Exit mobile version