Google Maps : గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుంటే నట్టేట ముంచింది

Google Maps
Google Maps : ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని వెళ్తే కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూస్తున్నాం. తాజాగా
గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని ప్రయాణించిన యువకులకు చేదు అనుభవం ఎదురైంది. గూగుల్ తల్లిని నమ్ముకుంటే నట్టేట ముంచింది. చివరకు బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు.
కేరళ కాసర్ గోఢ్ జిల్లాకు చెందిన అబ్దుల్ రషీద్ తో పాటు మరో యువకుడు ఆదివారం తెల్లవారు జామున కర్ణాటకలోని ఆసుపత్రికి బయలుదేరారు. ఈ సమయంలో గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించారు. అయితే, వారు ప్రయాణిస్తున్న కారు హఠాత్తుగా నదిలోకి దూసుకుపోయింది. నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా వారు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది.