MS Dhoni : ఐపీఎల్-2024లో నిన్న (ఆదివారం, మార్చి 31) కీలక జట్లు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోటీ హోరా హోరీగా సాగింది. చాలా సంవత్సరాల తర్వాత తన అభిమాన స్టార్ ఆటగాడు, మాజీ టీమిండియా కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాంటింగ్ చూసిన అభిమానులు కల్లు తేలేశారు.
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఆదివారం (మార్చి 31) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన మ్యాచ్‌లో CSK ఓడిపోయినప్పటికీ, చెన్నై ఫ్రాంచైజీ మద్దతుదారులు సంబురాలు చేసుకునేందుకు కారణం ఉంది.
42 ఏళ్ల ధోని 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అయినప్పటికీ, DC 20 పరుగుల తేడాతో విజయం నమోదు చేసుకుంది. CSKను విజయతీరాలకు తీసుకెళ్లేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాక్ సరిపోలేదు.
8వ స్థానంలో వచ్చిన ధోని పాతకాలపు నాక్ బ్యాటింగ్ లేకపోతే, CSK నష్టాల మార్జిన్ మరింత ఎక్కువగా ఉండేది. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి సింగిల్స్ తీయడానికి ధోనీ నిరాకరించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత, ధోని అధికారిక హ్యాండిల్ నుంచి 10 ఏళ్ల ట్వీట్ వైరల్ అయ్యింది. 2014, మార్చి 24న, ‘ఏ జట్టు గెలిచినా పర్వాలేదు, నేను వినోదం కోసం వచ్చా’ అని ధోని ట్వీట్ చేశాడు. 10 ఏళ్ల ఏడు రోజుల తర్వాత, అభిమానులు ఆ పాత పోస్ట్‌ను ఆదివారం ధోనీ ఇన్నింగ్స్‌తో ముడిపెడుతున్నారు.
వరుసగా రెండు విజయాలతో సీజన్‌ను ప్రారంభించిన తర్వాత ఐపీఎల్ 2024లో CSKకు ఇది తొలి ఓటమి. ఇది ధోని అభిమానులకు గుర్తుండిపోయే రాత్రి. సీజన్ ప్రారంభానికి ముందు, ధోనీ CSK కెప్టెన్సీ నుంచి వైదొలిగి రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పగించాడు.
ఈ క్రమంలో ధోని బ్యాటింగ్ చేసి మళ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. CSK ప్లేయర్‌గా ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చని ఊహాగానాలకు తెరలేస్తుండడంతో వారు అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నారు. ధోని ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతాడు, చివరిసారిగా 2019లో భారత జెర్సీలో కనిపించాడు. గతేడాది, ఐపీఎల్ తర్వాత, అతనికి మోకాలికి శస్త్రచికిత్స జరిగింది.
ఐపీఎల్ 2024లో CSK తదుపరి ఆట ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరుగుతుంది.