JAISW News Telugu

PM Modi : కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే..మోదీ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

PM Modi

PM Modi

PM Modi : దేశాన్ని పాలించే సత్తా బీజేపీకే ఉంది. దేశం సురక్షితంగా ఉండాలంటే అది బీజేపీతోనే సాధ్యం. కాంగ్రెస్ కు అంత సత్తా లేదు. కాంగ్రెస్ పాలనలో దేశం ఉగ్రమూకలకు స్వర్గధామంగా మారింది. పాకిస్థాన్ మూకలు చెలరేగిపోయారు. దేశం అంతా రక్తమోడింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉగ్రదాడులు అంతమయ్యాయి. దేశాన్ని సుభిక్షంగా ఉంచడంలో బీజేపీ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ ఓ ప్రచార సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశమంతా చర్చ జరుగుతోంది. పలువురు విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
 
ఇండియా  కూటమి అంటూ కాంగ్రెస్ అధికారం కోసం తాపత్రయపడుతున్నా కాంగ్రెస్ కు దేశాన్ని పాలించే అర్హత లేదంటున్నారు. పరిపాలనలో ముందుకు నడిచే సత్తా వారికి ఉండదు. సంపద మైనార్టీలకు పంచి అందరిని కష్టాల్లో పడేసే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలని చూడటం అత్యాశే అవుతుందని చెబుతున్నారు. దేశంలో ఒకనాడు 400 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కనీసం 300 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడమే కష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెగిన గాలిపటం లాంటిదని, దానికి ఓట్లు పడటం కష్టమేనని తేల్చేస్తున్నారు. యూపీఏ పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఎన్డీయే పాలన తారాజువ్వలా వెలుగుతోందని కూడా కితాబు ఇస్తున్నారు. రెండు కూటముల్లో ఉన్న తేడా ఇదేనంటున్నారు. రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలా ఉండగా కూటమిలో సరైన స్థాయిలో నేతలే లేరని.. విజయం ఎలా దక్కుతుందని ఎన్డీయే కూటమి ప్రశ్నిస్తోంది.

బీజేపీకి ఉన్న బలంతో దేశాన్ని పాలించే అధికారం ప్రజలు దానికి ఇవ్వడం సమంజసమేనంటున్నారు ఆ పార్టీ పెద్దలు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరని, దానికి ఆ అర్హత కూడా లేదంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైందంటున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ వారి ఆశలకు హద్దులు ఉండాల్సిందే అని అంటున్నారు.

చైనాను నియంత్రించడంలో కూడా బీజేపీ విజయం సాధించిందని కొనియాడుతున్నారు. డ్రాగన్ ను భయపెట్టి లొంగదీసుకోవడంలో ప్రధానమంత్రి సఫలం అయ్యారని, దీంతో చైనా ప్రస్తుతం తన హద్దుల్లోనే ఉంటోందంటున్నారు. ఏదైనా కయ్యానికి కాలు దువ్వితే తగిన గుణపాఠం చెబుతామని మోదీ చేసిన హెచ్చరికలతో నియంత్రణలోనే ఉంటోందని, ఇలా దేశాన్ని ముందుకు నడిపించడంలో బీజేపీదే పైచేయి అని వారు కితాబు ఇస్తున్నారు.

Exit mobile version