Food Contamination : క్యాబేజీపై రసాయనాలు.. ఇది తింటే మీ ఆరోగ్యం గోవిందా..

Food Contamination : కల్తీ కాదేది అనర్హం అన్నట్టుగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్లీనే కనిపిస్తోంది. తినే తిండి నుంచి తాగే నీరు వరకూ అంతా కల్తీనే.. కల్తీలేనిదే మార్కెట్లో ఏది కనిపించడం లేదు.

పంట పండించిన రైతు కూడా పంటను కాపాడుకోవడానికి ప్రమాదకార పురుగుల మందులు చల్లుతున్నాడు. అవే తిని మనం మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం..

తాజాగా ఉత్తర భారతంలో క్యాబేజీని కోసిన రైతులు ఓ చిన్న ట్రక్కులో ఎక్కించారు. అయితే క్యాబేజీ పాడవకుండా.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు విషపూరితమైన రసాయనాలు వాటిపై చల్లారు. దీనివల్ల పంట ఎక్కువ కాలం నిల్వ ఉంటుందట..

ఇప్పుడు ఆ విషం కలిపిన క్యాబేజీ కనుక మనం తింటే ఇక పైకి పోవడమే.. ఈ కల్తీ క్యాబేజీ తింటే గుండెపోట్లు, క్యాన్సర్లు, జుట్టు రాలిపోవడం, అనేక విష రోగాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇంతలా కల్తీ జరుగుతున్న ఈ క్యాబేజీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

TAGS