CM Revanth : చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా..: సీఎం రేవంత్

CM Revanth

CM Revanth

CM Revanth : చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి తప్పడా కుంవెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి గెలుపు పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని తాను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రాలో విజయఢంకా మోగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చట్టపరంగా తేలిపోయిందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు సంపూర్ణ రాజధాని అని పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్దతతో కూడుకున్న హామీ అని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని పునరుద్ఝాటించారు.

రాముడి పేరుతో ఓట్లు అడిగిన బీజేపీని రాముడు కూడా క్షమించలేదని అన్నారు. రామ మందిర నిర్మాణం చేపట్టిన ఫైజాబాద్ లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నారని, కేసీఆర్ ఉన్నంత కాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయన్నారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందనే అనుమానాలున్నాయని రేవంత్ పేర్కొన్నారు.

TAGS