JAISW News Telugu

Dog Bite : కుక్క కాలిగోళ్లతో రక్కినా టీకా వేయించుకోవాలా?

Dog Bite

Dog Bite

Dog Bite : రాను రాను నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా గ్రామ సింహాల (కుక్కల) సంఖ్య పెరుగుతూనే ఉంది. కుక్కల దాడిలో చిన్నారులు మరణించిన ఘటనలు కొన్ని చోట్ల చోటు చేసుకోగా.. బాటసారులు గాయపడిన ఘటనలు కోకొల్లలు. సంఖ్యను అదుపులో పెట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతుంటే, మానవులపై దాడులు చేయడం కంటే వాటిపై దాడులు చేస్తే బ్లూక్రాస్ లాంటి సంస్థలు ఒంటికాలుపై లేస్తున్నాయి.

శునకాలు మూగ జీవాలు వాటి విషయంలో కొంత సంయమనం పాటించడం మోరల్స్ గా భావించవచ్చు. కానీ వాటి దాడుల్లో చాలా రకాలుగా మనుషులు, వివిధ పెంపుడు జంతువులు బలవుతున్నాయి. పెంపుడు కుక్కల విషయంను పక్కన పెడితే వీధి కుక్కల విషయంలో అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే పెంపుడు కుక్కలైతే టీకాలు వేయిస్తారు కాబట్టి అవి కరిచినా రేబిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు. కానీ వీధి కుక్కలు కరిస్తే మాత్రం రేబిస్ గ్యారెంటి.

వీధి కుక్కలు కరిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి టీకాలు తీసుకుంటాం. ఇది జరిగేదే కానీ ఇవి గోర్లతో రక్కితే కూడా టీకాలు చేయించుకోవాలా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. శునకం నోటి లాలా జలంలో రేబిస్ వైరస్ ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ గోర్లల్లో కూడా ఉంటుందా? అంటే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే కుక్కలు ఎక్కువగా తమ కాళ్లను నాకుతుంటాయి. ఈ సందర్భంలో రేబిస్ వైరస్ వాటి గోర్లమధ్యలో ఉంటుంది.

ఈ సందర్భంలో కుక్క గోర్లతో రక్కితే రేబిస్ వైరస్ మనిషి చర్మంలోకి వెళ్తుంది. ఆ తర్వాత రేబిస్ వ్యాధికి కారణం అవుతుంది. కాబట్టి కుక్క రక్కినా రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్యులు. 

Exit mobile version