Identical Twins Abby and Brittney Hansal : అబ్బీ హన్సల్, బ్రిట్నీ హన్సల్ అవిభక్త కవలలు. వీరి శరీరం మొత్తం ఒక్కటే కానీ తలలు మాత్రం రెండుగా ఉన్నాయి. వీరు వివాహం చేసుకున్నామని ధ్రువీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2021 జోష్ బౌలింగ్ ను వారు వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి సిక్రెట్ గా ఉంచి మార్చిలో అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పుడు ఈ జంట సోషల్ మీడియాలో తన వివాహానికి సంబంధించిన విషయాలను పంచుకుంది.
34 ఏళ్ల అబ్బీ, బ్రిట్నీ మొండెం వద్ద కలిసి ఉన్నారు. వారి శరీరంలో ఒక వైపు ఒకరి కంట్రోల్ లో ఉంటుంది. 1996లో ‘ది ఓప్రా విన్ ఫ్రే’ షోతో ఫేమస్ అయ్యారు. ఈ కవలలు టీఎల్సీలో తమ సొంత రియాలిటీ షోను ప్రారంభించారు. అబ్బీ అండ్ బ్రిట్నీ జోయ్ డీ వివ్రేతో ప్రేమలో పడ్డారు. సీక్రెట్ డేటింగ్ తర్వాత వెడ్డింగ్ చేసుకున్నారు. వైట్ వెడ్డింగ్ డ్రెస్ లో ఉన్న అబ్బీ, బ్రిటనీ కలిసి గ్రే సూట్ ధరించిన జోష్ తో కరచాలనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఈ అక్కా చెల్లెల్లు – వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కడ వారు కస్టమ్ మేడ్ అద్భుతమైన తెలుపు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ ముగ్గురూ మిన్నెసోటాలో నివసిస్తున్నారు.
2012 లో ఒక వేదికపై మాట్లాడిన వారు బ్రిటనీ ఎడమ చేయి మరియు ఎడుమ కాలును నియంత్రిస్తుంది. అబ్బీ శరీరం కుడి వైపును నియంత్రిస్తుందని చెప్పారు. మేము ఒక రోజు తల్లులం కూడా కాబోతున్నాం. అని కూడా చెప్పారు.
వీరు పుట్టిన సంవత్సరం 1990లో వారిని వేరు చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అలా చేయడం వల్ల ఒకరు చనిపోవడమో.. లేదా.. శాశ్వతంగా హ్యండీ క్యాప్ గా మిగలడమో జరుగుతుందని డాక్టర్లు హెచ్చరించడంతో తల్లిదండ్రులు వెనక్కు తగ్గారు.
అబ్బీ, బ్రిట్నీ చాలా విషయాల వరకు వేర్వేరుగానే ఆలోచిస్తుంటారు. వారి 16వ ఏటా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. ఒక యూనివర్సిటీ నుంచి ఇద్దరూ వేర్వేరు డిగ్రీలు తీసుకున్నారు. ప్రస్తుతం టీచర్లుగా కొనసాగుతున్న వీరు 5వ తరగతి వరకు బోధిస్తారు. ఇద్దరు కూడా వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తారు.