ICC World Cup Final 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023 సమరం ముగియడానికి మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఈ ఫైనల్ వేడుకకు అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ పూర్తి ఏర్పాట్లు చేసింది. క్రీడాభిమానులను అలరించేలా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్ ను తిలకించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఎయిర్ షో
మ్యాచ్ ప్రారంభానికి పది నిమిషాల ముందు ఎయిర్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 9 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 9 సూర్యకిరణ్ అక్రోబెటిక్ టీమ్ విమానాలు ఈ షోలో సందడి చేయనున్నాయి. ఫ్లైట్ కమాండ్, డిప్యూటీ టీం లీడర్,వింగ్ కమాండర్ సిదేశ్ కార్తీక్ ఆధ్వర్యంలో ఈ షో జరగనుంది.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ షో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ చూడని గౌరవ వందనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇవ్వనున్నారు. పది నిమిషాల పాటు సంగీతానికి అనుగుణంగా ఈ 9 విమానాలు ఎయిర్ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.
హీరోస్ అసెంబ్లీ
గతంలో వరల్డ్ కప్ గెల్చుకున్న వివిధ దేశాల కెప్టెన్లు ఈ వేడుకలో అలరించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు పదిహేను నిమిషాల పాటు ఈ వేడుక నిర్వహించనున్నారు. వారిని గౌరవించేందుకు గాను స్పెషల్ బ్రేజర్ ను బీసీసీఐ సిద్ధం చేయించింది.
మ్యూజిక్
ఇక మ్యాచ్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ తమ బృందం తో కలిసి మ్యూజిక్ తో క్రీడాభిమానులను ఉర్రూతలుగించనున్నారు. సుమారు 500 మంది డ్యాన్సర్లు ఈ స్టేడియంలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ఇందుకోసం కొన్ని పాటలను కూడా సిద్ధం చేశారు. దేవా దేవా, కేసరియా, లెహ్రా దో, జితేగా జితేగా, నగడ నగడ, దూమ్ మాచ్ లే, దంగల్, దిల్ జషన్ బోలే, లాంటి పాటలు పాడి అలరించనున్నారు.
లేజర్ షో, డ్రోన్స్ షో
ఇక సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ డ్రింక్స్ బ్రేక్ లో 8.30 కు 90 సెకండ్ల పాటు లేజర్ షో నిర్వహించనున్నారు. అదే విధంగా 1200 డ్రోన్స్ తో షో నిర్వహించనున్నారు.
క్రాకర్స్ షో
ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే క్రాకర్స్ షో ఉండబోతున్నది. ప్రపంచమంతా నెవ్వరబోయేలా ముగింపు వేడుకను నిర్వహించేందుకు ఐసీసీతో పాటు బీసీసీఐ సిద్ధమైంది. అకాశానికి దూసుకెళ్లే తారాజువ్వలతో స్టేడియం ప్రాంగణంతో పాటు అహ్మదాబాద్ ప్రజానీకం నెవ్వరబోయేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.