JAISW News Telugu

Ibrahimpatnam incident : హైదరాబాద్ ను కలవరపెడుతున్న ఇబ్రహీంపట్నం ఘటన.. మరింత సీరియస్ గా అధికారులు..

Ibrahimpatnam incident

Ibrahimpatnam incident

Ibrahimpatnam incident : హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో క్రాకర్స్ దుకాణంలో పేలుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రాకర్ షాపులను పోలీస్, ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని కానీ అలా జరగలేదు. ఇబ్రహింపట్నంలోని వీటీపీపీఎస్ స్టోర్ లో బాణసంచాను అక్రమంగా నిల్వ చేయడంతో పాటు అమ్మకాలు చేస్తున్నారు. భద్రత, నియంత్రణ మార్గదర్శకాలను విస్మరించి పెద్ద మొత్తంలో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.

ఈ పెద్దస్థాయి కార్యకలాపాలపై అధికారులు కనీస చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాల చట్టం మరియు సంబంధిత బీఎన్ఎస్ సెక్షన్లకు అనుగుణంగా, తగిన లైసెన్సులు లేకుండా బాణసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని నొక్కి చెబుతూ నగర పోలీస్ కమిషనర్ ప్రకటనలు జారీ చేశారు. ప్రమాదాలను నివారించేందుకు విక్రేతలందరూ తప్పనిసరిగా భద్రతా ప్రోటోకాల్ ను పాటించాలని కమిషనర్ హెచ్చరించారు. అయినా కూడా వీఐపీఎస్ స్టోర్ తన అనధికార కార్యకలాపాలను కొనసాగిస్తూ, స్థానిక అధికారుల అవినీతి, నిర్లక్ష్యం గురించి ఆందోళనలను రేకెత్తించింది.

1884 నాటి పేలుడు పదార్థాల చట్టం సెక్షన్ 19 బీ (1) ఏ కింద, లైసెన్స్ లేకుండా తయారీ, దిగుమతి, నిల్వ చేస్తే మూడేళ్ల జైలు, రూ. 15వేల జరిమానా ఉంటుంది. లైసెన్స్ లేకుండా అమ్మకాలు చేసినా, రవాణా చేసినా రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ప్రజా భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు, పెరుగుతున్న సమాజ ఒత్తిడితో ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే అధికారులపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. పండుగ కాలంలో భద్రత, లైసెన్సింగ్ ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, అన్ని బాణసంచా అమ్మకాలను నిశితంగా పర్యవేక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Exit mobile version