IAS Postings and Transfers : పాలనా పరమైన విధానాల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొంత మంది ఐఏఎస్ లకు కీలక పోస్ట్ లకు కేటాయించింది. మరికొందరిని బదిలీ చేసింది. దీంతో పాటు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న కొంత మంది అధికారులకు కూడా పోస్టింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయగా.. ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి ఆర్డర్ పాస్ చేసింది.
వైద్య ఆరోగ్య శాఖ సయుక్త కార్యదర్శిగా టీ వినయ్ కృష్ణా రెడ్డి
ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్
పశు సంవర్థకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్
గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్
టీఎస్ ఐఆర్‌డీ సీఈవోగా కాత్యాయని దేవి
రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్
రేవంత్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనలో వేగం పెంచారు. ప్రతీ శాఖ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటూ అందులో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆయన ఐఏఎస్ ల అవసరంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో ఐఏఎస్ ల లోటును వివరించారు. ఆయన కూడా అందుకు తగ్గట్లుగా వెంటనే కొంత మందిని అలాట్ చేయగా.. మిగిలిన వారిని కూడా పంపిస్తామని హామీ ఇచ్చారు.
కొత్తగా వచ్చిన వారు, పాత వారి పని తనాన్ని పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి వారికి శాఖలను కేటాయించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రభుత్వ సెక్రటరీ శాంతి కుమారి ఆర్డర్ కాపీలను అందజేశారు.