JAISW News Telugu

Donald Trump:ట్రంప్‌కు బిగ్ షాక్‌..కొల‌రాడో తీర్పుపై వివేక్ రామ‌స్వామి ఏమ‌న్నారంటే..

Donald Trump:అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ కోల‌రాడో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. రిప‌బ్లిక‌న్‌ పార్టీ రాష్ట్ర ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా అధ్య‌క్షుడు జో బైడెన్ కుట్రేన‌ని మండిప‌డ్డారు. మ‌రో వైపు ఈ తీర్పుపై రిప‌బ్లిక‌న్ నేత, అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వానికి పోటీప‌డుతున్న వివేక్ రామ‌స్వామి కూడా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ట్రంప్ పోటీలో లేక‌పోతే తాను కూడా వైదొలుగుతాన‌ని ప్ర‌క‌టించారు.

2021 నాటి యూఎస్ క్యాపిట‌ల్ భ‌వ‌నంపై దాడిని ట్రంప్ ప్రేరేపించిన కార‌ణంగా కొల‌రాడోలో జ‌రిగే రిప‌బ్లిక‌న్ ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌కుండా ఆ రాష్ట్ర సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై భార‌త సంత‌తి నేత వివేక్ రామ‌స్వామి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. `ట్రంప్‌ను పోటీప‌డేందుకు అనుమ‌తించ‌క‌పోతే నేను కూడా కొల‌రాడో ప్రైమ‌రీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతా. అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వానికి పోటీప‌డుతున్న ఇత‌ర రిప‌బ్లిక‌న్ నేత‌లు రాన్ డిశాంటీస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాల‌ని డియాండ్ చేస్తున్నా. లేదంటే ఈ చ‌ట్టవిరుద్ధ‌మైన నిర్ణ‌యాన్ని వారు మౌనంగా స‌మ‌ర్ధించిన వార‌వుతారు. ఇలాంటి తీర్పుల కార‌ణంగా దేశం తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది` అని రామ‌స్వామి ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

బైడెన్ ప్ర‌జాస్వామ్యానికి ముప్పు:ట్రంప్‌

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా న‌న్ను న‌లువ‌రించేందుకు జో బైడెన్, ఆయ‌న స‌మూహం చేస్తున్న ఇలాంటి విప‌రీత చ‌ర్య‌లు ఏ మాత్రం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని వారు తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారు. జో బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు. మేం ఘోరంగా ఓడిస్తామ‌ని వారికి తెలుసు. అందుకే చ‌ట్ట సంస్థ‌ల‌ను ఆయుధాలుగా చేసుకుని ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో జోక్యం చేసుకుంటున్నారు` అని ట్రంప్ మండిప‌డ్డారు. వ‌చ్చే ఏడాది మార్చిలో కొల‌రాడోలో జ‌రిగే రిప‌బ్లిక‌న్‌ ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లోట్రంప్ పోటీ చేయ‌కుండా కోర్టు తాజాగా తీర్పు వెలువ‌రించి ఆయ‌న‌కు షాక్ ఇచ్చింది.

Exit mobile version