JAISW News Telugu

Suresh Gopi : నేను కేంద్రమంత్రిగానే ఉంటా.. రాజీనామా చేయడం లేదు: సురేశ్ గోపి

Suresh Gopi

Suresh Gopi

Suresh Gopi : కొన్ని మీడియా ప్లాట్ ఫామ్స్ లో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను కేంద్రమంత్రి బీజేపీ ఎంపీ సురేశ్ గోపి ఖండించారు. కేంద్రమంత్రి వర్గం నుంచి ఆయన రిజైన్ చేసినట్లు వస్తున్న వార్తలను తప్పుబట్టారు. పీఎం మోదీ నేతృత్వంలో కేరళ అభివృద్ధి చేసేందుకు తాము కలిసికట్టుగా ఉన్నామని ఆయన ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని త్రిసూర్ ఎంపీగా సురేశ్ గోపి గెలుపొందారు. దీంతో తొలిసారి మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

‘‘కొన్ని మీడియా సంస్థలు తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటూ తప్పుడు వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. అది పూర్తిగా అబద్ధం. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తాము కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని సురేశ్ గోపి తన పోస్టులో తెలిపారు.

కాగా, కేరళ నుంచి బీజేపీ తొలి లోక్ సభ ఎంపీగా ఎన్నికైన సురేశ్ గోపి త్రిసూర్ లో 74 వేల ఓట్లతో విజయం సాధించారు. లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యే ముందు సురేశ్ గోపి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్రమంత్రిగా సురేశ్ గోపి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

Exit mobile version