Manchu Vishnu : మౌనంగా ఉండను.. మంచు విష్ణు

Manchu Vishnu
Manchu Vishnu : ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడవద్దని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు. అక్కినేని ఫ్యామిలీ, సమతపై మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరిని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఆ ఆరోపణల్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దన్నారు. తమ వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దని విష్ణు పేర్కొన్నారు. అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి. చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండను. మేమంతా ఏకమై నిలబడతామని మంచు విష్ణు హెచ్చరించారు.