Pawan Kalyan : అలా చేస్తే నేనే హోం మంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan : రాష్ట్రంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హింసాత్మక నేరాలు పెరగడానికి అధికార దుర్వినియోగం కారణం అన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కళ్యాణ్ విమర్శించారు. గత పరిపాలనాపరమైన బలహీనతలు నేరస్థులకు ధైర్యం కలిగించాయని ముఖ్యంగా మహిళలు, పిల్లలకు అసురక్షిత వాతావరణానికి దోహదపడ్డాయని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో పిల్లలపై లైంగిక వేధింపులు.. దొంగతనాలు వంటి ఇటీవలి కేసులతో సహా హింసాత్మక నేరాల ప్రమాదకర పెరుగుదల గురించి చర్చించిన సందర్భంగా కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలపై లైంగికదాడి వంటి నీచమైన చర్యలకు పాల్పడే వ్యక్తులు జనావాసాల్లో ఇంకా ఉండడం ప్రభుత్వాల చాతకాని తనమేనన్నారు. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)తో సహా మునుపటి అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని, నేరస్థులు శిక్షార్హులు శిక్షార్హులు కాకుండా వ్యవహరించేలా చేశారని కళ్యాణ్ ఆరోపించారు.
క్రిమినల్స్ కు కులం, మతం లాంటివి ఉండవని, పోలీసులకు ఈ విషయాన్ని పదే పదే చెప్పాల్సిన గతి పట్టిందన్నారు. లైంగికదాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. హోం మంత్రి వంగలపూడి అనితపై కూడా డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ఆమెనే ఇటీవల జరుగుతున్న లైంగికదాడుల ఘటనలకు బాధ్యత వహించాలని ‘నేను హోం మంత్రిత్వ శాఖను చేపట్టినట్లయితే, విషయాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి’ అని పవన్ నొక్కిచెప్పాడు,
మార్పులు అమలు చేయకపోతే భవిష్యత్తులో తను కలుగజేసుకోవడం చూస్తారని సూచించాడు. “నేను పంచాయత్ రాజ్ మంత్రిని, హోం మంత్రిగా మీ బాధ్యతను నిర్వర్తించండి అని నేను మీకు చెప్తున్నాను. పరిస్థితులు మెరుగుపడకుంటే నేనే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి రావచ్చు’’ అని అనితను హెచ్చరించారు.