Samantha : నేను ఆ విషయంలో తప్పు చేశా.. సమంతా ఎమోషనల్
Samantha : సమంతా దశాబ్ద కాలానికి పైగా సినీ పరిశ్రమలో ఉంటూ తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంది. ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మంచి అందంతో పాటు అభినయం ఉన్న కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. ఇక ఆమె మాట్లాడే ప్రతీ మాట..చేసే ప్రతీ యాక్టివిటీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. పాజిటివ్ కామెంట్స్ కు సమానంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ప్రతీ దాన్ని ఓ చాలెంజింగ్ గా తీసుకుని ముందుకెళ్తోంది.
తన ఇష్టాయిస్టాలను గుర్తించడంలో ఫెయిల్ అయ్యాయని, నేను ఆ విషయంలో తప్పు చేశానని సమంత కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు ఇస్తుంటుంది. రీసెంట్ గా తన ఫ్యాన్స్ కు తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్ చేస్తూ పైవిధంగా స్పందించింది.
తన ఇష్టాలను గుర్తించడం లేదనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నానని, ఎందుకంటే తన భాగస్వామి గతంలో వాటిని ప్రభావితం చేశాడని చెప్పింది. క్లిష్టమైన పరిస్థితుల నుంచే పాఠం నేర్చుకుంటామనే విషయం తనకు అప్పుడే అర్థమైందని తెలిపింది. ఎప్పుడైతే ఆ విషయాన్ని తాను గ్రహించానో అప్పటి నుంచే తన ఎదుగుదల మొదలైందని చెప్పుకొచ్చింది.
సమంత గతంలో ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన విడాకులు, వరుస ప్లాపులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయని, వాటితో తానెంతో కుంగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటోందని, మరోవైపు వైవాహిక బంధం ముగిసిపోయిందని.. దీంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానంది. ప్రస్తుతం సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చిన సమంత తన వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతోంది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.