Chiranjeevi : ఎన్టీఆర్ చెప్పిన మాట లెక్క చేయనందుకు నాకు తగిన శాస్తి జరిగింది – చిరంజీవి!

 chiranjeevi not taken NTR's words into consideration

chiranjeevi not taken NTR’s words into consideration

Megastar Chiranjeevi : ఎన్టీఆర్ చెప్పిన మాట లెక్క చేయనందుకు నాకు తగిన శాస్తి జరిగింది – చిరంజీవి!సీనియర్ హీరోలు అప్పుడప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన యంగ్ హీరోలకు ఏదైనా మంచి ఆశించి చెప్పినప్పుడు వాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే చాలా ఎఫెక్ట్ అవుతారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు వారి జీవితం లో ఎన్నో చూసేసి ఉంటారు. ఆ అనుభవం తో చెప్తారు, కాబట్టి వాళ్ళ మాటలకు గౌరవం ఇవ్వడం తప్పనిసరి.

అలా చిరంజీవి ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలను లెక్కచెయ్యపోవడం వల్ల ఆరు నెలలు షూటింగ్ లేకుండా ఇంట్లో మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో ఎన్టీఆర్ మరియు చిరంజీవి కాంబినేషన్ లో ‘తిరుగులేని మనిషి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో ఎన్టీఆర్ తో తనకి ఎదురైనా ఒక అనుభవం గురించి చెప్పుకొచ్చాడు మెగాస్టార్.

ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో నేను ఎన్టీఆర్ గారితో కలిసి తిరుగులేని మనిషి అనే సినిమా చేశాను. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం అప్పుడు నేను ఎన్టీఆర్ గారు ఒక టేబుల్ మీద నిల్చొని విలన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాం. ఆ సమయం లో మేమిద్దరం టేబుల్ మీద నుండి ఎగిరి క్రిందకు దూకాలి. టేక్ అనగానే నేను దూకేసాను. అప్పుడు ఎన్టీఆర్ ఏంటి బ్రదర్ అలా చేసారు అని అడిగాడు. అంటే డైరెక్టర్ అదే చెప్పారు కదా సార్ అని అన్నాను. అప్పుడు ఎన్టీఆర్ ఇలాంటివి చెయ్యడానికి మనకి డూప్స్ ఉంటారు, మనం చెయ్యకూడదు. బాగా అబివృద్ది లోకి వస్తున్న నటుడివి, నిన్ను నమ్ముకొని వందలాది మంది పని ఆధారపడి ఉంటుంది. ఇలా డూప్ లేకుండా చేసినప్పుడు నీకు ఏదైనా జరిగితే అందరూ నెలల తరబడి పనులు లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, నిర్మాతకి బోలెడంత డబ్బు నష్టం అని చెప్పాడు. ఆయన చెప్పింది నిజమే కదా అనిపించింది. కానీ కుర్ర వయస్సు కదా, ఏదైనా సొంతంగా చెయ్యాలి అనుకునేవాడిని. అలా సంఘర్షణ సినిమా సమయం లో ఒక రిస్కీ స్టంట్ చేశాను. కాళ్ళు దెబ్బతిన్నాయి,ఆరు నెలలు షూటింగ్ కి దూరమై ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే పెద్దల మాటలను ఎలాంటి పరిస్థితి లో కూడా సీరియస్ గా తీసుకోవాలి’ అంటూ చిరంజీవి ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

TAGS