Director Sukumar : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆర్య’ విడుదలై మే7కు 20 ఏళ్లు పూర్తవుతుంది. అయితే, ఈ సినిమా స్టోరీ అనుకున్న తర్వాత అల్లు అర్జున్ ను ఫైనల్ చేసే ముందు సుకుమార్, నిర్మాత దిల్ రాజు ప్రభాస్, రవితేజకు స్క్రిప్ట్ వినిపించారట. 125 రోజులకు పైగా నడిచిన ‘ఆర్య’ అల్లు అర్జున్ కెరీర్ లో భారీ మైలురాయిగా నిలిచి ఇప్పుడు తన ఫిల్మోగ్రఫీలో కల్ట్ క్లాసిక్ గా గుర్తింపు పొందింది.
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం సంబురాలు చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమం షూటింగ్ సమయంలో జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
మొదట రవితేజ, ప్రభాస్ ను సంప్రదించినట్లు నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘మొదట్లో సుకుమార్ స్క్రిప్ట్ రవితేజ దగ్గరకు తీసుకెళ్లగా ఆయనకు నచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ దగ్గరకు వెళ్లాం కానీ ఆ సమయంలో ఆయన మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రసాద్ ల్యాబ్స్ లో ‘దిల్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాం. అక్కడ ‘ఆర్య’ గురించి మాట్లాడుకున్నాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. అతను ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతాడని భావించి సెలక్ట్ చేశాం.
ఈ సినిమాలో ప్రభాస్ నటించడంలో తనకు సందేహం ఉందని సుకుమార్ వెల్లడించాడు. దిల్ రాజు సలహా తీసుకొని ప్రభాస్ కు కథ చెప్పాను. కానీ, అతను ఆ పాత్రకు సరిపోతాడో లేదో నాకు తెలియదు. ప్రభాస్ కూడా అలాగే ఫీలయ్యాడు. కానీ, ‘దిల్’ సినిమా స్క్రీనింగ్ లో బన్నీ (అల్లు అర్జున్)ని చూసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ చూసి ఆశ్చర్యపోయాను. ‘ఆర్య’ కంటే ముందు 71 స్క్రిప్టులు విన్నానని, కానీ అవి ఆకట్టుకోలేదని బన్నీ చెప్పాడు. ఆ తర్వాత ‘ఆర్య’ ఫస్ట్ హాఫ్ ఆయనకు చెప్పాను, ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
దిల్ రాజు మాట్లాడుతూ -‘అల్లు అరవింద్ ను కలిస్తే ఆయన కొన్ని మార్పులు సూచించారు. మొదట్లో నిరాశ వ్యక్తం చేసిన సుకుమార్ సినిమాను వదిలి స్వగ్రామానికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఒకే కాన్సెప్ట్ గురించి పలుమార్లు చెప్పడం, మాట్లాడటం నచ్చక లెక్చరర్ ఉద్యోగం మానేశానని చెప్పాడు. పలు కథనాలు చెప్పమని అడిగినందుకు ఆయన నిరాశ చెందారు. ‘ఆర్య’ స్క్రిప్ట్ పై చాలా మంది పనిచేశారని, వారు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు’ అన్నారు.