Prabhakar Rao : నేనూ కేసీఆర్ బాధితుడనే – ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు

Prabhakar Rao

Prabhakar Rao

Prabhakar Rao : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు తాను కూడా కేసీఆర్ బాధితుడినేనని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా మారిన తర్వాత తొలిసారి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కీలక విషయాలు పేర్కొన్నారు. ఇదే కేసులో ఏ6గా ఉన్న మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు ఇదే తరహా అఫిడవిట్ ను కోర్టులో దాఖలు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. మాజీ సీఎం, తనది ఒకే కులం కావడం వల్ల తనను ఎస్ఐబీ చీఫ్ గా నియమించినట్లు పోలీసులు చెప్తున్న దానిలో నిజం లేదన్నారు. తాను కూడా కేసీఆర్ బాధితుడినేనని వెల్లడించారు. అప్పట్లో విపక్ష నేతలకు మద్దతిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పగా అక్కడి నుంచి సీఐడీకి బదిలీ చేశారని అఫిడవిట్ లో పేర్కొన్నారు. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించేందుకు తనకు ఐదు నెలలు ఆలస్యం చేశారన్నారు. ఎస్ఐబీలో ఎస్పీగా పదేళ్ల అనుభవం ఉండడంతో పాటు అప్పటి డీజీపీ సిఫార్సుతోనే ఎస్ఐబీ అధిపతిగా నియమించారని అఫిడవిట్ లో వివరించారు.

TAGS