Sharmila : నా బిడ్డల మీద ప్రమాణం.. ప్రభాస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఇది జగన్ కుట్ర: షర్మిల
మా అమ్మ మీద కేసు పెడతారు. తండ్రి పేరు సీబీఐలో పెడతారు. ఇప్పుడు చెబుతున్నా జగన్మోహన్ రెడ్డికి తన చెల్లెలిపై ప్రేమ ఉంటే ఆ ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు.. గాడిదలు కాశావా.. చెల్లిపై ఇలాంటి ప్రచారం చేస్తుంటే అది తన మైలేజీకి వాడుకుంటున్నాడు. తన మైలేజ్ కోసం తన సోదరి పరువు తీస్తున్నారంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే అప్పట్లో ప్రభాస్ హీరోగా వి.వి దర్శకత్వంలో ‘యోగి’ సినిమా తెరకెక్కింది. కడప మేయర్ వినాయక్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావ మరిది.. విజయమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ షూటింగ్ సమయంలోనే ప్రభాస్, షర్మిల కలిశారని పుకార్లు వ్యాపించాయి. అప్పటి నుంచి ప్రభాస్, షర్మిలకు లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభాస్ స్పందించలేదు. ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వీడియోలపై కేసు వేసి ఆ యూట్యూబ్ వీడియోలను డిలీట్ చేయించారు. ఇటీవల 2024 ఎన్నికల నేపథ్యంలో తన అన్నకు చెల్లికి పడకపోవడంతో తాజాగా ప్రభాస్ తో ఎన్నో ఏళ్లుగా రిలేషన్ అంటగడుతున్న వారికి తన బిడ్డల మీద ప్రమాణం చేసి.. ఆయనతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పి రాజకీయంగా సంచలనం రేపారు షర్మిల.