JAISW News Telugu

Actor Upendra : ‘‘జీరో నుంచి స్టార్ట్ చేశా..అదే నాకు ప్లస్ పాయింట్..’’ఎంత గొప్పగా చెప్పాడో ఉపేంద్ర

Actor Upendra

Actor Upendra

Actor Upendra : ఉపేంద్ర..ఈ పేరు చెబితేనే వైవిధ్య చిత్రాలు గుర్తుకువస్తాయి. భారతదేశంలోనే ఏ దర్శకుడు, నటుడు చేయలేని, తీయలేని సినిమాలు తీసిన ఘనత ఈయనది. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, సాహిత్య కారుడిగా, నేపథ్యగాయకుడిగా వివిధ రంగాల్లో ప్రతిభ ఆయన సొంతం. తనదైన చిత్రాలతో దక్షిణాదిని ఊపేస్తున్నారు ఉపేంద్ర. ఓం, ఏ, ఉపేంద్ర..వంటి చిత్రాలతో కన్నడ నాటనే కాదు తెలుగు సీమను ఉర్రూతలూగించారు. ‘‘మస్త్ మస్త్ పాప ఉంది..’’అంటూ తెలుగు జనాలను డాన్స్ లు వేయించారు.

ఉపేంద్ర సినిమా వస్తుందంటేనే యూత్ కు పండుగ. ఆయన సినిమాను చూసి అర్థం చేసుకోవడం సగటు ప్రేక్షకుడికి కష్టమే. ఆయన సినిమా కథ వింతగా ఉంటుంది. డ్రెస్సింగ్, పాటలు, సెటైర్స్..ఇలా ఏ దర్శకుడు టచ్ చేయని పాయింట్ తో సినిమాలు చేస్తారు ఉపేంద్ర. ఇక ఆయన తీసిన సినిమాలకు ఆయనే హీరో. ఎందుకంటే దర్శకుడిగా ఉపేంద్ర స్థాయిని అందుకోవాలంటే అది మళ్లీ ఆయనకే సాధ్యం. అందుకే కన్నడ టాప్ హీరోగా, దర్శకుడిగా ఆయన వెలుగొందుతున్నాడు.

తాజాగా ఓ తెలుగు ఇంటర్వ్యూ లో ఇంటర్వ్యూయర్ స్వప్నతో  ఉపేంద్ర  తన గురించి ఆసక్తికర విషయాలనే కాదు గొప్ప యువతకు స్ఫూర్తిగా తీసుకునే విషయాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…‘‘ నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏమి లేని నుంచి స్టార్ట్ చేశాను..అదే నాకు ప్లస్ పాయింట్ ..నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను..పోగొట్టుకునేదానికేం లేదు.. ఏమోచ్చిన ప్లస్ నాకే నాకు.. అదే నా అదృష్టం.’’ అని తన జీవితం గురించి సాదాసీదాగా చెప్పేశారు. దానికి ఇంటర్వ్యూయర్  స్వప్న ‘‘మీకు ఇంత పాజిటివ్ అవుట్ లుక్ ఎలా వచ్చింది. ఎందుకంటే ఎంత ఎదిగినా ఏదో ఒక చేదు జ్ఞాపకం ఉంటుంది కదా.. మీకు అలా లేదా..అని ప్రశ్న అడుగుతుంది. దానికి ఉపేంద్ర..‘‘లేదు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో..ఇప్పుడు అలానే ఉన్నాను. నన్ను అప్పుడు అవమానించినవారి పట్ల కూడా నేను ఇప్పుడు గౌరవిస్తూనే ఉంటాను.’’ అంటూ ఓ ఎమోషనల్ కోట్ చెప్పారు.

Exit mobile version