Pemmasani Chandrasekhar : నిజాయితీగా ఉంటాను కనుకే ధైర్యంగా మాట్లాడుతా..కేంద్ర మంత్రి పెమ్మసాని పాత వీడియో వైరల్
Pemmasani Chandrasekhar : ఏపీలో అత్యంత అదృష్టవంతుడు ఎవరంటే పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పవచ్చు. తాజాగా లోక్ సభ ఎన్నికల బరిలో దిగి.. గుంటూరు నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు పెమ్మసాని. తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. వృత్తిపరంగా వైద్యుడు, వ్యాపారవేత్త అని తెలిసిందే. అమెరికాలో వైద్యుడిగా పనిచేయడమే కాదు వ్యాపారాలు కూడా నిర్వహించారు. ‘యు వరల్డ్’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన ఆదాయ వనరు. కాగా, ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాజాగా వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడిన విధానం, విజన్ చూసి అంతా గ్రేట్ సార్ మీరు అని కొనియాడుతున్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అవేంటో చూద్దాం..
‘‘తనకు చిన్నప్పటి నుంచే కష్టపడే గుణముందని..తాను నమ్మంది తప్పక చేస్తాను. నేను పెరిగిన వాతావరణంలో ఎంతో మంది పేదలని చూశాను. సమస్యలపై చిన్నప్పుడే పూర్తి అవగాహన ఉంది. నాకు ప్రజాసేవ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉన్నా..సంవత్సరం కింద చంద్రబాబు గారు పిలువడం..మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని కోరితే వచ్చానని..తర్వాత నాకు అన్ని కలిసివచ్చాయి. దేవుడు నాకు కావాల్సిన అన్నీ ఇచ్చాడు. సొసైటీ బాగా లేనప్పుడు నాలాంటి ధైర్యం ఉన్నవారు..సమర్థత ఉన్నవారు రావాలి.’’ అని చెప్పుకొచ్చారు.
సొసైటీలో నిజాయితీగా ఉన్నవారే ధైర్యంగా మాట్లాడుతారని, తాను గానీ, పవన్ కల్యాణ్ గారు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే మేము నిజాయితీగా ఉండడమే కారణమన్నారు. మనీ పాలిటిక్స్ చాలా బాధకరమన్నారు. ఇవి ఒక్క రోజులో పోతాయని అనుకోను. అయితే ఇలాంటి పోవాలంటే తన వంతు పాత్ర కచ్చితంగా ఉంటుందన్నారు. జగన్ రెడ్డి పాలనతో ఏపీ చాలా నష్టపోయిందన్నారు. ఏపీలో రోడ్లు బాగా లేకపోవడంతో ఎంతో మంది చనిపోయారన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, బ్యాలెన్స్ డ్ గా సంక్షేమాన్ని అందించడంలో టీడీపీ కృషి చేస్తుందన్నారు. జగన్ రెడ్డి వేల కోట్లు సంపాదించడన్నారు.
మంచివాళ్లు, మేధావులు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా దూషించేవారిని రాజకీయాల్లో నుంచి సస్పెండ్ చేయాలి.. అందుకే పొలిటికల్ సెన్సార్ బోర్డు ఉండాలని చెప్పానన్నారు. గల్లా జయదేవ్ కంపెనీలను గత ప్రభుత్వం ఇబ్బంది పడితే ఆయన రాజకీయాలను స్వచ్ఛందంగా పదవి వద్దనుకున్నారు. ఆ తర్వాతే తనకు ఎంపీ సీటు వచ్చిందన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాతే నేను పోటీ చేశానన్నారు. ఆయన సపోర్ట్ నాకు చాలా ఉందన్నారు.