JAISW News Telugu

Rishabh Pant : ఏడు నెలలు నరకం చూశా.. ఆ సమయంలో చనిపోయాను అనుకున్నా.. స్టార్ క్రికెటర్ ఆవేదన..

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant : క్రికెట్ అభిమానులకు రిషబ్ పంత్ గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ తర్వాత బెస్ట్ వికెట్ కీపర్.. మంచి బ్యాట్స్ మన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ పుణ్యమా అని తనకు ఇష్టమైన పిచ్ పైకి వచ్చాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించి జట్టును నడపడంలో సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో  T20కి ఎంపియ్యాడు. ఇప్పటికే T20 ఆతిథ్య దేశం అమెరికాకు వెళ్లాడు. అయితే తాను ప్రాణాపాయం నుంచి బయటపడిన విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాత కొన్ని నెలలు తీవ్ర నరకం అనుభవించానని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ..

‘ఆ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఆ సమయం కూడా ఎంతో అనుభవం నేర్పింది. ప్రమాదంలో కలిగిన గాయాల తీవ్రతను తలుచుకుంటే చనిపోతాను కావచ్చని సందేహం కలిగింది. ఏడు నెలలు భరించలేని నొప్పులను, ప్రమాదం తాలూకు భయాన్ని అనుభవించా. అది నరకంగా అనిపించింది. దాదాపు 2 నెలల వరకు బ్రష్‌ కూడా చేసుకోలేకపోయా. వీల్‌చైర్ లో ఉండేవారిని చూస్తే ఇబ్బంది అనిపించేది, భయం వేసేది. అందుకే ఎయిర్‌ పోర్టుకు కూడా వెళ్లలేకపోయా. కానీ, భగవంతుడు రక్షించాడు’ అని రిషభ్‌ గుర్తు చేసుకున్నాడు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న పంత్‌.. ఈ విషయాలను పంచుకున్నాడు.

2022, డిసెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండిపోయాడు. తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెట్‌పై దృష్టి పెట్టాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి అభిమానుల ఆదరణ సంపాదించుకున్న ఆయన తెగువను చూసిన బీసీసీఐ టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టులోకి తీసుకుంది.

Exit mobile version