Pawan Kalyan : హరీశ్ బాధ చూడలేకనే అలా చెప్పా..పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : త్వరలోనే ఏపీ ఎన్నికలు ఉండడంతో పవన్ కల్యాణ్ బిజీ బిజీ అయిపోయారు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. పవన్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. అయితే ఇప్పుడు పవన్ బిజీగా ఉండడంతో షూటింగ్ ఆగిపోయింది. కానీ సడన్ గా ఆ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో ‘‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’’, ‘‘గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం’’ అనే రెండు డైలాగులు ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తున్నాయనే చెప్పాలి. ఈ డైలాగ్ లను వారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇవి రాజకీయ కోణంలోనే చెప్పారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

ఇదే విషయమై జనసేన పార్టీ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో పవన్ మాట్లాడుతూ.. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తారు.. ఆ గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది.. షూటింగ్ జరిగేటప్పుడు ఆ డైలాగ్ ఎందుకు రాశావ్ అని హరీశ్ శంకర్ ను అడిగితే.. అందరూ మీరు ఓడిపోయారు..ఓడిపోయారు అంటే నేను ఒకటే చెప్పా.. గాజుకు ఉండే లక్షణం ఏంటంటే పగిలేకొద్ది పదునెక్కుతుంది.. మీకు తెలియదు మాలాంటి ఫ్యాన్స్ ఇలాంటివి కోరుకుంటారు అని చెప్పాడు.’’ అని పవన్ వెల్లడించారు. ‘‘వాస్తవానికి నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం ఉండదు. కానీ హరీశ్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పానని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ రెండు డైలాగ్ లో ఏపీని ఊపేస్తున్నాయనే చెప్పాలి.

TAGS