JAISW News Telugu

Dhoni : అతని ఆటతీరు నాకెంతో ఇష్టం.. అది దేవుడిచ్చిన గిఫ్ట్ : ధోని

Dhoni

Dhoni and Rohit

Dhoni : అంతర్జాతీయ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్‌ సెంచరీలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. 2007లో వన్డేల్లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన చేసిన రోహిత్‌ శర్మ తొలి మూడు మ్యాచ్‌ల్లో మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ కు దిగాడు. ఆ తర్వాత అతడి నాలుగో వన్డే మ్యాచ్‌ నుంచి జట్టులో ఓపెనర్‌గా స్థానంలోకి వచ్చాడు. రోహిత్ శర్మ అలా ఒపెనర్ గా దిగిన మొదటి మ్యాచ్‌లోనే 93 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్‌ దూకుడు ఆటతీరుతో టీమిండియా 48 ఓవర్లలో 258 పరుగులు చేసి 3-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఆటతీరును గుర్తు చేసుకున్నాడు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని. రోహిత్‌ శర్మకు టాలెంట్‌ దేవుడిచ్చిన గిఫ్ట్ అంటూ ధోని  కొనియాడాడు.

‘రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడతాడని, అతడి ఆటతీరు తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఈ విషయంలో అతడికి టాలెంట్‌ దేవుడిచ్చిన గిఫ్ట్ అని  ప్రశంసించాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడడం రోహిత్‌ శర్మకు చాలా అవసరమని పేర్కొన్నాడు.  జట్టులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇలాంటి ఆటతీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెప్పాడు. రోహిత్ శర్మ ఆట తీరుకు వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆనందిస్తుందన్నాడు. అప్పుడు రోహిత్‌, మనోజ్‌ తివారిలు జట్టులో ఓపెనర్లుగా ఉన్నారని, ఇద్దరిలో ఒకరు కచ్చితంగా విరుచుకుపడేలా ఉండాలనుకున్నామని పేర్కొన్నాడు. కానీ  మనోజ్‌ అలాంటి దూకుడు ఆటతీరును ప్రదర్శించలేడదని,  కానీ రోహిత్‌ దానిని తన బాధ్యతగా తీసుకున్నాడని గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఓపెనర్‌గా రోహిత్ మరింత రాణిస్తున్నాడని  కొనియాడారు.  కెప్టెన్ రోహిత్‌ శర్మ  265 వన్డే మ్యాచులు ఆడి 10,866 పరుగులు పూర్తి చేశాడు.

హిట్‌మ్యాన్‌ తన పదహారేళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. వన్డే చరిత్రలో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా రోహిత్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగుల చేసి రికార్డు సృష్టించాడు.  2019 వన్డే ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో ఐదు సెంచరీలతో పాటు అత్యధిక సెంచరీలు(7) నమోదు చేశాడు. 241 ఇన్నింగ్స్‌లోనే 10 వేల పరుగుల మార్క్‌ని అందుకున్న రెండో క్రికెటర్ రోహిత్‌. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్ట్‌కు రోహిత్ అందుబాటులో ఉండకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Exit mobile version