Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలప్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్ 26న తాను భారత్ కు రావలసి ఉందని తెలిపారు. ఆరోగ్యవ బాగోలేక అమెరికాలో ఉండిపొవలసి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్ రావు తెలిపారు.