JAISW News Telugu

Vijayawada : ఇక పోసాని వంతు..  విజయవాడ లో కేసు నమోదు

posani

posani

Vijayawada : వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు సినీ, రాజకీయ నేతలు ఆ పార్టీకి మద్దతుగా ప్రత్యర్థులపై నోరు పారేసుకునేవారు. ఇక సోషల్ మీడియాలో ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. బోరుగడ్డ అనిల్‌కుమార్‌, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆర్జీవీ.. ఇలా వైసీపీ మద్దతుదారులు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆడవారిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడేవారు. వీరందరికీ సంకీర్ణ ప్రభుత్వం షాక్‌లు ఇవ్వనుంది. సోషల్ మీడియా పరిమితికి మించి ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు పోలీసులు.

వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ప్రజలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో పోసానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోసాని వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని జనసేన పార్టీ నేత బడిత శంకర్ అన్నారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కృష్ణమురళి వ్యాఖ్యలను తొలగించాలని వారు తమ ఫిర్యాదులో పోలీసులను కోరారు.  వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి జనసేన నేతలు మరో షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనసైనికుల ఫిర్యాదుపై రాజమండ్రిలో కేసు నమోదైంది. ఈ కేసును జనసేన లీగల్ సెల్ యాక్టివ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో పోసానిపై చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ సెల్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కోరింది.

అప్పట్లో పోసాని వ్యాఖ్యలపై జనసైనికులు రాజమండ్రి 1వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేశారు. కోర్టు ఆదేశాలతో 2022 నవంబర్‌లో పోసానిపై కేసు నమోదైంది. తాజాగా వైసీపీ అనుచిత సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు కావడం… పోసాని కేసును జనసేన యాక్టివ్ చేసింది.

Exit mobile version