Vijayawada : ఇక పోసాని వంతు.. విజయవాడ లో కేసు నమోదు
వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ప్రజలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో పోసానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోసాని వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని జనసేన పార్టీ నేత బడిత శంకర్ అన్నారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కృష్ణమురళి వ్యాఖ్యలను తొలగించాలని వారు తమ ఫిర్యాదులో పోలీసులను కోరారు. వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి జనసేన నేతలు మరో షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనసైనికుల ఫిర్యాదుపై రాజమండ్రిలో కేసు నమోదైంది. ఈ కేసును జనసేన లీగల్ సెల్ యాక్టివ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో పోసానిపై చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ సెల్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కోరింది.
అప్పట్లో పోసాని వ్యాఖ్యలపై జనసైనికులు రాజమండ్రి 1వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేశారు. కోర్టు ఆదేశాలతో 2022 నవంబర్‌లో పోసానిపై కేసు నమోదైంది. తాజాగా వైసీపీ అనుచిత సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు కావడం… పోసాని కేసును జనసేన యాక్టివ్ చేసింది.