JAISW News Telugu

RP Patnaik : నాకు అసలు టాలెంట్ లేదు.. కానీ సక్సెస్ అయ్యాను – ఆర్ఫీ పట్నాయక్

RP Patnaik

RP Patnaik

RP Patnaik : టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడు ఆర్ఫీ పట్నాయక్. 2000 దశాబ్దం ప్రారంభం లో ఆయన ఒక ప్రభంజనం. అప్పట్లో ఎక్కడ చూసిన ఆర్ఫీ పట్నాయక్ పాటలే వినపడేవి. 1999 వ సంవత్సరం లో ఆయన తన కెరీర్ ని ప్రారంభించాడు. రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘నీకోసం’ అనే సినిమా ద్వారా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించాడు.

ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ, పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘ఎప్పుడూ చూడని ఆలోచనలు..ఇప్పుడే కలిగెను ఎందుకు నాలో..నీకోసం’ అంటూ సాగే టైటిల్ సాంగ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ పాత ద్వారానే ఆర్ఫీ పట్నాయక్ ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో వరుసగా అవకాశాలను సంపాదించాడు. ఇక ఆ తర్వాత ‘చిత్రం’ , ‘నువ్వునేను’, ‘జయం’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు లేక నేను లేను’, ‘సంతోషం’ ఇలా ఒక్కటా రెండా, మన రెండు చెవుల్లో అమృతం పొసే స్థాయి మ్యూజిక్ ని ఈ సినిమాల ద్వారా ఆయన అందించాడు.

అలా ఆర్పీ పట్నాయక్ అందించిన ప్రతీ ఆల్బం చార్ట్ బస్టర్స్ గా నిల్చి దశాబ్దాలు గడిచినా మర్చిపోలేని రేంజ్ పాటలుగా నిలిచాయి. కేవలం తెలుగు లోనే కాదు, తమిళం , కన్నడం , హిందీ మరియు మలయాళం భాషల్లో కూడా ఆయన ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని అందించాడు. సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నటుడిగా కూడా ఆర్ఫీ పట్నాయక్ రాణించాడు. ఇలా ఇన్ని విభాగాల్లో రాణించిన ఆర్ఫీ పట్నాయక్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి అసలు మ్యూజిక్ టాలెంట్ లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆయన మాట్లాడుతూ ‘నాకు నిజంగా మ్యూజిక్ అంటే ఏంటో తెలియదు. ఎవరైనా ఒక రాగం ఇచ్చి ట్యూన్ చెయ్యమని చెప్తే నేను అసలు చెయ్యలేను. దర్శకుడు ఒక సందర్భం చెప్పినప్పుడు, ఆ సందర్భానికి తగ్గట్టుగా లిరిక్స్ ఇస్తే, నా మనసులో నుండి వచ్చే భావాలనే సంగీతం రూపం లో బయటపెట్టగలిగాను కానీ, రాగం ఇచ్చి దానికి తగ్గట్టు మ్యూజిక్ ని కంపోజ్ చెయ్యడం నా వల్ల అసలు కాదు. అందుకే నా సంగీతం మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా బిన్నంగా ఉంటుంది. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎవరో ఒకరి దగ్గర పని చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. కానీ నేను డైరెక్ట్ గానే మ్యూజిక్ డైరెక్టర్ ని అయ్యాను. చెన్నై నుండి ఇటు వచ్చిన వారికి అవకాశాలు బాగా దక్కాయి. అలా నాకు కూడా దక్కాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version