Ambati Rambabu : అంబటి రాంబాబు గురించి ఆయన అల్లుడు డా. గౌతమ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అంబటి రాంబాబుకు అల్లుడిని అవడం దురదృష్టమని, రాంబాబు భయంకరమైన వ్యక్తి అని అన్నారు. ప్రస్తుతం రాంబాబు పోటీ చేస్తున్న పదవికి అర్హత లేదని, అరిచి అబద్దాలాడేవారిని, నిస్సిగ్గుగా వ్యవహరించే వారిని గెలిపించవద్దని ఆయన వీడియోలో చెప్పారు.
ఏ మాత్రం మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో అవి జీరో పర్సెంట్ కూడా రాంబాబులో లేవని అన్నారు. సిగ్గు లేకుండా ఏ పనైనా చేయవచ్చని అనుకునేవాళ్లకు ఓటేయవద్దని కోరారు. ఇలాంటి వాళ్లను గెలిపిస్తే ఇదే సమాజం యొక్క తలరాతలా మారే అవకాశముందని పేర్కొన్నారు. దయచేసి సరైన ఓటుతో, బాధ్యతతో ఓటువేసి సరైన నాయకున్ని ఎన్నుకోవాలని డా.గౌతమ్ వీడియోలో కోరారు.