Samantha : నేను జీవితంలో అగ్నిగుండాలను ఎన్నింటినో దాటాను.. ఇప్పుడు ధైర్యంగా ఉన్నా.. సమంత సంచలన కామెంట్స్
Samantha : సమంత తెలుగులో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన హిరోయిన్ అని టక్కున చెప్పొచ్చు. అంతలా ప్రభావం చూపిన నటి తన పర్సనల్ లైఫ్ లో వచ్చిన విభేదాల కారణంగా అక్కినేని నాగ చైతన్య తో విడాకుల తర్వాత ఆమె చాలా కుంగిపోయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఈ మూడేళ్లలో ఎన్నో అగ్ని గుండాలను దాటాను.
ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురైతేనే మనం గెలవగలమా.. లేదా అన్నది తెలుస్తుంది. మనం గెలిచి నిలిచితేనే ఏదైనా సాధించగలం. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొవాల్సిందే. అలా చేయగలిగినపుడే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవితంలో జరిగే చాలా విషయాలు మనల్ని దృఢంగా మారుస్తాయి.
సమంత విడాకుల అనంతరం చాలా డిఫ్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు మాట్లాడిస్తే కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతం అయ్యేది. చాలా అనారోగ్య సమస్యలతో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు దూరమైంది. ఆ సమయంలో ఆమెపై ఎన్నో ఆరోపణలు చేశారు. కావాలనే నాగ చైౌతన్యతో విడాకులు తీసుకుందని అని విమర్శలు చేశారు. దీనికి తోడు హెల్త్ ఇష్యూష్ కూడా ఆమెను డిఫ్రెషన్ లోకి తీసుకెళ్లాయి. కాగా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. తాజాగా సినిమాల్లో మళ్లీ బిజీగా మారిపోతుంది.
తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాలో సమంత నటిస్తోంది. సమంత ఈ సంవత్సరం మొత్తం బిజీ షెడ్యూల్ తో రెడీ అయిపోయిందని తెలుస్తోంది. అన్నిసవాళ్లను దాటి సమంత ముందుకు సాగుతుండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పై మునుపటి సమంతను స్క్రీన్ పై చూస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమంత దక్షిణాది సినిమాల్లో ప్రేక్షకులకు అభిమాన నటిగా మిగిలిపోయింది. సమంత మూవీస్ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.