Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి సోషల్ మీడియా లో నిత్యం ట్రెండ్ లో ఉండే పేరు నిహారిక కొణిదెల. తనకి సంబంధించిన ఫోటోలు , వీడియోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ వచ్చిన నిహారిక ఈ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారింది. చైతన్య తో పెళ్ళికి చేసుకొని విడాకులు జరిగిన తర్వాత ఆమె దాని గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. సమంత లాగ పరోక్ష కామెంట్లు అసలు చెయ్యలేదు.
కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాత్రం ఆమె తన విడాకుల విషయాన్నీ ప్రస్తావిస్తూ ఎమోషనల్ గా మాట్లాడింది . ఆమె మాట్లాడుతూ ‘ ఏ అమ్మాయి తన భర్త తో విడిపోవాలని అనుకోదు. పరిస్థితులు అలాంటివి వచినప్పవుడే తప్పనిసరిగా విడాకులు తీసుకోవాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని ఏడాది లోపు విడిపోవాలని ఏ అమ్మాయి కూడా కోరుకోదు అంటూ ఆమె కామెంట్ చేసింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ వైవాహిక జీవితం ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. నమ్మితే ఇలాగే దారుణంగా మోసపోతారు. విడాకుల సమయం లో చాలా బాధపడ్డాను. కానీ కలిసి ఉండలేమి అని తెలిసిన తర్వాత కూడా ప్రపంచం ఏమి అనుకుంటుందో అనేది ఆలోచించలేను. మా ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమి అనుకుంటున్నారు అనేదే నాకు కావాలి’ అంటూ చెప్పుకొచ్చింది. నమ్మి మోసాను పోయాను అంటుంది కాబట్టి చైతన్య నిహారిక ని కావాలని మోసం చేశాడా..?. ఆమె తో వైవాహిక బంధం లో కొనసాగుతున్నప్పుడే వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడా..?, అసలు ఆమె మాట వెనుక దాగున్న ఉద్దేశ్యం ఏమిటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో అంతలా వైరల్ అయ్యింది.
ఇక ఆమె కెరీర్ గురించి ఒకసారి చూస్తే, ఇప్పటి వరకు ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత నిర్మాతగా మారింది కానీ అక్కడ కూడా సక్సెస్ దక్కలేదు. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్ సిరీస్ లలో నటించిన ఆమె, రీసెంట్ గా ఒక సినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.