JAISW News Telugu

CM Jagan : నాకు ఫోన్ లేదు..  ప్రైవేట్ లైఫూ లేదు..:జగన్

CM Jagan

CM Jagan

CM Jagan : ప్రస్తుతం దేశమంతా ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది.  మళ్లీ అందులోనూ ఏపీ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతుండగా.. ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. రాజకీయాలు మంచి రసవత్తరంగా మారాయి. వైసీపీ సింగిల్‌గానే బరిలోకి దిగుతుండగా.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం ఏం ఫోన్ వాడుతున్నారు.. అసలు ఫోన్ వాడుతారా లేదా తెలుసుకోవాలని ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నాకు ఫోన్ లేదు…నాకు నంబరే లేదని పేర్కొన్నారు సీఎం జగన్. ఏదైనా అవసరం వస్తే.. పక్కనే పీఏలు ఉంటారు.. అన్ని వాళ్లే చూసుకుంటారని వివరించారు. నాకు ఫోన్‌ వాడే అవసరం రాలేదని వివరించారు జగన్‌. నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా లేదు.. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే అని వెల్లడించారు. అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తానన్నారు. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. నా ఓటు బ్యాంక్ ను చీల్చాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహించారు. షర్మిల ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారు. ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్ ఏంటో తెలుస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

దాంతో పాటు.. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కేసీఆర్ సర్కార్ పడిపోవడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం, అందుకు సహకరించిన పరిస్థితులపై వైఎస్ జగన్ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది.. ఏం జరిగిందన్న అంశం జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వం రావటానికి, పాత ప్రభుత్వం పోవటానికి అనేక అంశాలు ప్రభావితం చేశాయి. వాటి లోతుల్లోకి వెళ్లటం వల్ల పెద్దగా సాధించేది ఏమీ లేదు. కానీ.. ఏపీ ప్రజల ముందు ఉన్నది రెండే ఆప్షన్లు.. విలువలు, విశ్వసనీయతకు ఓటేస్తారా.. లేక మోసపోయి అబద్దాలకు ఓటేస్తారా.. అన్నదే వాళ్ల ముందు ఉంది.” అంటూ వైఎస్ జగన్ వివరించారు.

Exit mobile version