Samantha : ఇలా జరుగుతుందనుకోలేదు..మరోసారి సమంతా నిర్వేదం

Samantha

Samantha

Samantha : హీరోయిన్ సమంతా ఎంతటి స్టార్ డమ్ అనుభవించిందో..ప్రస్తుతం అంతటి మానసిక క్షోభను అనుభవిస్తుందని తెలుస్తోంది. వీటికి కారణం నాగచైతన్య వివాహ బంధం తెగిపోవడం, మరొకటి మయోసైటిస్ వ్యాధి. ఈ రెండింటితో సమంతా మునపటిలా ఉండలేకపోతోంది. అయినా ధైర్యంతో అడుగులు వేస్తూ ముందుకెళ్లిపోతోంది.

నాగచైతన్య, సమంతా వివాహాన్ని ఫ్యాన్స్ ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. బెస్ట్ క్యూట్ కపుల్ గా అంతటా సందడి చేసేవారు. అక్కినేని వంటి పెద్ద ఇంటి కుటుంబానికి కోడలుగా వెళ్లిన సమంతా మొదట్లో అందరితో బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. నాగచైతన్య, సమంతా విడాకులు తీసుకుంటున్నారని వార్తలు రావడం, తొందర్లోనే వివాహ బంధం తెగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీనికి కారణం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఏవేవో మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంటాయి. కానీ అవేవీ అధికారికంగా ధ్రువీకరించినవి కావు. ఆ తర్వాత వెంటనే సమంతా మయోసైటిస్ వ్యాధి బారిన పడడం ఆమెను తీవ్ర మానసిక వేధనలోకి దింపింది అని మాత్రం చెప్పవచ్చు. తన అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించే ఒక పాడ్ కాస్ట్ ను ఈ మధ్యే ప్రారంభించింది సమంతా. అందులో తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేస్తోంది.

తాజాగా నాగచైతన్యతో విడాకులపై స్పందించింది. ‘‘నాకు బాగా గుర్తుంది. నాకు ఈ సమస్య రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు ఎంతో కష్టంగా గడిచింది. నేను నా మేనేజర్ హిమాంక్ తో ముంబై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోందని తనతో చెప్పా. చాలా కాలంగా నేను ఇంత ప్రశాంతంగా లేనని కూడా చెప్పాను. ఫైనల్ గా నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను. తృప్తిగా నిద్రపోగలుగుతున్నాను. లేచి నా పనిపైన దృష్టి పెట్టగలుగుతున్నాను..అని అనిపించే లోపే నాకు ఈ కండీషన్ ఉందని తెలిసింది. నిద్రలేచేసరికి ఈ అనారోగ్యం నాపై దాడిచేసింది’’ అని సమంతా చెప్పుకొచ్చింది. అయితే ఏడాది కింద సమంత నాగచైతన్య విడాకులు ప్రకటించారు. దీంతో దాన్ని ఉద్దేశించే సామ్ కష్టంగా గడిచిందని చెప్పి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు.

TAGS