JAISW News Telugu

Renu Desai : నేను వదల్లేదు.. ఆయనే నన్ను వదిలేశాడు.. రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు

Renu Desai

Renu Desai – Pawan Kalyan

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి ఏళ్లు గడుస్తోంది. అయినా సరే ఆయన అభిమానులు మాత్రం ఆమెను వదలడం లేదు. సోషల్ మీడియాలో ఆమె ఏ పోస్ట్ పెట్టినా అక్కడ కామెంట్స్ రూపంలో నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అలాగే ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతుంటారు. అప్పటికీ ఈ విషయంపై చాలాసార్లు రేణు దేశాయ్ స్పందించారు.   దయచేసి తన దగ్గర  ఆయన ప్రస్తావని నా దగ్గర తీసుకురాకండి అని చెప్తూ వచ్చారు.   అయినా కూడా పట్టించుకోకవడంతో చాలా మందిని బ్లాక్ కూడా చేసేసింది.   తాజాగా అలాంటి మరో సారి ఆమె పవన్ ఫ్యాన్స్ పై మండిపడాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది.

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా ప్రతీసారి.. తనకు మాజీ భర్త వల్లే ఐడెంటీటీ ఉందని, పవన్  వల్లే తనకు అస్థిత్వం ఉందన్నట్టుగా మాట్లాడుతుంటారు. మా అన్నతో ఉంటే బాగుండేదని, మా అన్నని ఎందుకు వదిలేశావ్ వదిన అంటూ ఇలా పదే పదే కామెంట్లు పెడుతుంటారు. ఇక తాజాగా రేణూ దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి చెప్పింది. ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో స్వయంగా ప్రసాదం చేయడం అంటే ఎంతో ఇష్టమని రేణు చెప్పుకొచ్చింది. ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్ట్ మీద కూడా పవన్ ఫ్యాన్స్  అనవసరమైన కామెంట్లు పెడుతున్నారు.

వదిన గారు మీరు కొన్ని ఏళ్లు ఓపిక పట్టుంటే బాగుండేది.. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు.. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది.. ఏది ఏమైనా విధి అంతా నిర్ణయిస్తుంది.. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన.. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ ఓ అభిమాని కామెంట్ చేసినట్లు కనిపిస్తుంది.  దానికి రేణూ దేశాయ్.. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు.. ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు.. నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు  ఇలాంటి కామెంట్స్ పెట్టి.. అని మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను బాధపెట్టవద్దని ఆమె ఆవేదన చెందారు.

Exit mobile version