Shah Rukh Khan : ఆ రెండు ప్రాజెక్టులు చేయడం నాతో కాలేదు..: షారూక్ ఖాన్

Shah Rukh Khan
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షాగా పేరు సంపాదించుకున్న షారూక్ ఖాన్ నార్త్ సినీ ఇండస్ట్రీని ఒక సమయంలో ఏలాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎంత పెద్ద హీరో అయినా ఒక్కొక్క సినిమా, ఒక్కో కథకు సరిపోలేరు. అలా షారూక్ కొన్ని సినిమాల్లో తనకు ఛాన్స్ వచ్చిందని కానీ వాటిని నేను తిరస్కరించానని చెప్పుకచ్చాడు. అందులో ఒకటి పుష్ప. పుష్ప పాన్ ఇండియాత రేంజ్ లో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాలీవుడ్ రీమేక్ కోసం డైరెక్టర్ షారూక్ ను సంప్రదించాడట కానీ అల్లు అర్జున్ స్లాంగ్ తనకు రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ చేయి దాటి పోయిందని చెప్పుకచ్చారు. దీంతో పాటు అమీర్ ఖాన్ చేసిన లాల్ సింగ్ చడ్డా కూడా తనకు సరిపోలేదని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల గురించి ఆయన చెప్పడంతో సోషల్ మీడియాలో మీమ్ గా వైరల్ అవుతుంది.