JAISW News Telugu

Manikantha : నేను అన్న ఒకే తల్లి పిల్లలం.. తండ్రులే వేరు..  మణికంఠ చెల్లి సంచలన విషయాలు

Manikantha

Manikantha sitster

Manikantha sister : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ ప్రసారమవుతోంది. ఆదివారం  దాదాపు 8 మంది వైల్డ్ కార్డులో కంటెస్టెంట్లు హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అందరికంటే విచిత్రమైన క్యారెక్టర్ ఎవరంటే ఎవరైనా  మణికంఠ అనే  చాలామంది చెబుతారు. ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. ఆయనకు సపోర్ట్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నట్లే.. విమర్శించేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మణికంఠ సోదరి కావ్య అమర్ నాథ్ తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది.

అనవసరంగా బిగ్ బాస్ షోకి వెళ్లి కుటుంబ విషయాలన్నీ రోడ్డున పడేశాడని అనుకున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘అవును ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చెప్పకూడదు అనిపించింది. ఇటీవలే నాకు నిశ్చితార్థం జరిగింది. మా మామగారి కుటుంబానికి కూడా కాల్స్ వచ్చాయి. వారి బంధువులు ఫోన్ చేసి, అలాంటి కుటుంబం నుండి అమ్మాయి ఎందుకు తెచ్చుకుంటున్నారని అడిగారు.

‘అంత లో క్లాస్ అయినప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు ఇలాంటి అమ్మాయిని మా అత్తమ్మని అడిగారు. కానీ ఆమెకు నా గురించి ముందే తెలుసు కాబట్టి మాకు లేని ప్రాబ్లం మీకేంటి అని వాళ్లని అడిగి, నాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్’ అంటూ మణికంఠ చెల్లి కావ్య చెప్పింది.

‘చిన్నప్పటి నుంచి వాడు అంతే. నాదే, నా ఒక్కడితే బాధని అనుకుంటాడు. పక్కనోళ్లు బాధ గురించి వాడు పట్టించుకోడు. ఇవన్నీ పక్కనబెడితే వాడు గెలిచి రావాలి. ఎందుకంటే వెళ్లిందే దానికోసం. మేమందరం ఇన్ని అవమానాలు తీసుకున్నాం. ఎందుకంటే వాడు గెలిచి వస్తాడనే కదా. బయటనే కాదు హౌసులో కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు’ అని మణికంఠ చెల్లెలు తన ఆవేదన బయటపెట్టింది.

మణికంఠ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో.. తన తల్లి రెండో పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి వల్ల.. అలానే పెళ్లయి, పాప పుట్టిన తర్వాత భార్య తనకు విడాకులు ఇచ్చిందని.. ఈ రెండింటి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డాడని బిగ్‌బాస్ షోలో ఇతర కంటెస్టెంట్లతో చెప్పుకొచ్చాడు. ఇది విని బాధపడే వాళ్లు కొందరైతే. సింపతీ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేసేవాళ్లు మరికొందరు. దీని వల్ల మణికంఠనే కాదు ఇతడి తీరు వల్ల బయట ఉన్న చెల్లి, భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది.

Exit mobile version