Autobiography of Ex CM : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐకి సంబంధించి 11, ఈడీకి సంబంధించి 9 కేసులు ఉన్నాయి. 2019 నుంచి ఆయన సీఎంగా కొనసాగుతుండడంతో పాలనా పరమైన ఇబ్బందులతో ఆయన వాయిదాలు కోరుతున్నారు. కోర్టులు కూడా చట్టాన్ని అనుసరించి వాయిదా వేస్తూ వస్తోంది. ఆయన సీఎం కాబట్టి పనులు, సమావేశాలు, పర్యటనలు, ప్రజా పాలన నేపథ్యంలో న్యాయమూర్తులు న్యాయ పరమైన సడలింపులు ఇచ్చుకుంటూ వెళ్లారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు 11 సీట్లు రావడం, అందునా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగానే ఉండడంతో కేసుల దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడుల విషయంలో భారీ అవినీతి అక్రమాలకు తెర లేపారు జగన్. ఈ కేసుల విషయమై గతంలో కొంత కాలం జైలు జీవితం కూడా గడిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత జైలులో కొంత కాలం ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో పాదయాత్ర చేపట్టి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై ఉన్న కేసుల విచారణ వేగం పుంజుకోనుంది. ఒక వేళ జగన్ కు శిక్షపడి జైలులో ఉంటే ఎలా ఉంటుందనే దానిపై వ్యంగ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలులో ఆయనకు వయస్సు పెరుగుతుంది. ఏజ్ ఎక్కువ కావడంతో తన ఆత్మకథను రాసుకుంటాడు. ఇక ఆ ఆత్మకథకు ‘నేను నా ప్యాలెసులు’ అంటూ టైటిల్ పెడతాడని ఫొటోను చూస్తే అర్థం అవుతుంది. అంటే జగన్ ఎన్నేళ్లయినా జైలులో ఉంటూ తను తన అక్రమ సంపాదన గురించే ఆలోచిస్తాడని చెప్పకనే చెప్తోంది.