Ratan Tata : నేను బాగానే ఉన్నా.. రొటీన్ చెకప్ మాత్రమే : రతన్ టాటా

Ratan Tata : దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై సోమవారం పుకార్లు వ్యాపించాయి. బీపీ పడిపోవడం వల్ల టాటా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఐసీయూలో చేరినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను రతన్ టాటా ఖండించారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చానని చెప్పారు. చింతించాల్సిన పనిలేదన్నారబు. రతన్ టాటా మార్చి 1991లో దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 2012లో పదవీ విరమణ చేశారు. టాటా ఇప్పటికీ టాటా సన్స్‌కు గౌరవ చైర్మన్‌గా ఉన్నారు. 2008లో అతనికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించింది. 2000లో పద్మభూషణ్ అందుకున్నారు.

రతన్ టాటా తన ప్రకటనలో, ‘‘నా ఆరోగ్యం గురించి వ్యాప్తి చెందుతున్న పుకార్ల గురించి నాకు తెలుసు. ఈ వాదనలు నిరాధారమైనవని అందరికీ హామీ ఇవ్వాలనుకుంటున్నాను. నా వయస్సు కారణంగా నేను వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. చింతించాల్సిన పనిలేదు. నేను మంచి మానసిక స్థితిలో ఉన్నాను . తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండమని ప్రజలను, మీడియాను అభ్యర్థిస్తున్నాను.’’ అంటూ సోషల్ మీడియాలో ప్రకటన జారీ చేశారు.

సోషల్ మీడియాలో పాపులర్
టాటా ఇప్పటికీ టాటా సన్స్‌కు గౌరవ చైర్మన్‌గా ఉన్నారు. 2008లో అతనికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించింది. 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అందుకున్నారు. రతన్ టాటా సోషల్ మీడియాలో బాగా పాపులర్. ట్విట్టర్ లో అతనికి 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు, అయితే ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ల మంది అతనిని అనుసరిస్తున్నారు.

TAGS