Actress Namitha : నేను హిందువునే.. మధుర మీనాక్షి ఆలయ అధికారులపై నటి నమిత ఫిర్యాదు

Actress Namitha
Actress Namitha : తమిళనాడులోని చెన్నై మధుర మీనాక్షి ఆలయంలో మరోసారి వివాదం నెలకొంది. ఆలయ అధికారులపై దేవాదాయశాఖకు ప్రముఖ సినీ నటి నమిత ఫిర్యాదు చేసింది. హిందువులకే ఆలయ దర్శనమంటూ ఆలయ అధికారులను తనను అవమానించారని నమిత ఆరోపించారు. అన్య మతస్థులకు దర్శనంలో నిబంధనలు ఉన్నాయి. వాటిని మాత్రమే తాము ఫాలో అవుతున్నామని అధికారులు చెబుతున్నారని ఆవేదన చెందారు. తాను తిరుమలలో పెళ్లి చేసుకున్నానని, తాను హిందువేనని, తన పిల్లలు కూడా హిందువులేనని నమిత స్పష్టం చేశారు.
ఈ రోజు (సోమవారం) ఉదయం కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లానని నమిత తెలిపారు. అక్కడ సడెన్ గా ఆలయ అధికారులు తనను అడ్డుకొని సర్టిఫికెట్లు అడగడంతో షాక్ కు గురైనట్లు చెప్పారు. ఇప్పటివరకు తాను దేశంలోని అనేక ఆలయాలకు వెళ్లానని, ఎక్కడా తనను సర్టిఫికెట్లు అడగలేదని నమిత పేర్కొన్నారు. అనంతరం నమిత ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసింది.