Hydra : ‘హైడ్రా’ ఉక్కుపాదం.. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

Hydra

Hydra

Hydra : హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అనేక నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు.. తాజాగా మాదాపూర్ లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తున్నారు. చెరువును కబ్జాచేసి ఈ సెంటర్ నిర్మించారన్న ఆరోపణలతో కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. ఈరోజు (శనివారం) ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.

తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారు జాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు. కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసివేశారు. మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

TAGS